కాంగ్రెస్ తో క‌మ‌ల్ దోస్తానా ..!

news02 Aug. 7, 2018, 1:16 p.m. political

kamalhasan party

చెన్నై : త‌మిళ‌నాడులో స‌రికొత్త పొత్తుల‌కు తెర‌లేవ‌బోతోంది . కొత్త‌గా రాజ‌కీయ పార్టీ స్థాపించి త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో స్పీడ్ గా దూసుకుపోతున్న ప్ర‌ముఖ సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ పొలిటిక‌ల్ అడుగులు కాంగ్రెస్ కూట‌మివైపు ప‌డుతున్నాయి . క‌మ‌ల్ హాస‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో దోస్తీ క‌ట్టేందుకు సిద్ద‌మౌతున్నారు . త‌మిళ‌నాట జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌రువాత ఆ రాష్ట్రంలో త‌లెత్తిన రాజ‌కీయ అనిశ్చితి స‌మ‌యంలో బీజేపీ ప్ర‌వ‌ర్థించిన తీరుపై అప్ప‌ట్లోనే బ‌హిరంగంగా త‌న అసంతృప్తి వెళ్ళ‌గ‌క్కిన క‌మ‌ల్ పార్టీ మక్కల్‌ నీది మయ్యం  .. క్ర‌మంగా  హ‌స్తం వైపు ద‌గ్గ‌ర‌వుతూ వ‌స్తోంది .

kamalhasan party

ప్ర‌ధానంగా న‌రేంద్ర మోడీ .. అమిత్ షాలు త‌మ స్వార్థ‌రాజ‌కీయాల కోసం త‌మిళ ఆత్మాభిమానాన్ని కించ‌ప‌రిచేలా ప్ర‌వ‌ర్థించార‌ని క‌మ‌ల్ బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు గుప్పించారు . మోడీ .. అమిత్ షా రాజ‌కీయాల‌ను త‌మిళ ప్ర‌జ‌లు స‌హించ‌ర‌ని .. స‌రైన స‌మ‌యంలో త‌గిన బుద్ది చెబుతార‌ని చెబుతూ వ‌చ్చిన క‌మ‌ల్ .. ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ .. బీజేపీకి బుద్ది చెప్పేందుకు రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా కాంగ్రెస్ తో క‌లిసి న‌డిచేందుకు సిద్ద‌మైయ్యారు .

kamalhasan party

ఇప్పటికే త‌మిళ‌నాడులో యూపీఏతో డీఎంకే  పొత్తు ఖరారు కాగా .. టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ..  రాందాసు నేతృత్వంలోని పీఎంకే .. తిరుమావళవన్‌ నేతృత్వంలోని వీసీకే కాంగ్రెస్ తో కలిసి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు . ఇప్పుడు తాజాగా క‌మ‌ల్ పార్టీ మక్కల్‌ నీది మయ్యం కూడా కాంగ్రెస్ తో క‌లిసి వ‌స్తుండ‌టం హ‌స్తం పార్టీకి మ‌రింత బ‌లం చేకూర‌నుంది . 

kamalhasan party

tags: kamalhasan,kamalhasan party,tamilnadu,dmk,aidmk,rahul gandhi,soniya gandhi,jayalalitha,rajinikanth,tamilnadu politics,kamalhasan party alliance with congress party,bjp,narendra modi,amith sha,rahul gandhi tamilnadu tour

Related Post