పోలీసులు కేసీఆర్ కు తొత్తులుగా మారారు..

news02 Sept. 11, 2018, 7:31 a.m. political

uttam

హైదరాబాద్- మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి అరెస్ట్ ను పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అక్రమ పాస్ పోర్ట్ కేసులో జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు.  కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం దారణమని ఉత్తమ్ చెప్పారు. ఈ మేరకు అర్ధరాత్రి పీసిసి చీఫ్ ఉత్తమ్, షబ్బీర్ ఆలి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సునితా లక్ష్మారెడ్డి తదితరులు కుందన్ బాగ్ లో డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారణలో ఉన్న జగ్గారెడ్డిని పీసిసి చీఫ్ ఉత్తమ్ తదితరులు పరామర్శించారు. పార్టీ వెంట ఉంటుందని జగ్గారెడ్డికి ఉత్తమ్ భరోసా ఇచ్చారు. 

uttam

ఇక 2004 లో ఎఫ్ ఐఆర్ నమోదైన కేసును ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మళ్లీ తిరగతోడారని ఈ సంర్బంగా ఉత్తమ్ గుర్తు చేశారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ కేసులో స్వయంగా అపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కాశిపేట లింగయ్య, షకీల్, మధుసూదనా రెడ్డి పేర్లు ఉన్నాయని ఉత్తమ్ చెప్పారు. కానీ కేసుకు సంబందించిన స్టేట్ మెంట్ లో జగ్గారెడ్డి పేరు ఎక్కడా లేదని ఆయన తెలిపారు. నిజానికి ఆపధ్దర్ము సీఎం కేసీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేయాల్సింది పోయి జగ్గారెడ్డిపై రాజకీయ కక్ష్యతో అరెస్ట్ చేశారని ఉత్తమ్ మండిపడ్డారు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన.. ఆపధ్దర్మ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. 

uttam

ఇక ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ కేసులో ఆపధ్దర్మ సీఎం కేసీఆర్, హరీష్ రావులకు సంబంధం ఉందన్న ఉత్తమ్.. వారిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు కుటుంబం పేరుమీద గుజరాత్ కు చెందిన వారు అమెరికాలో ఇప్పటికీ ఉన్నారని.. హరీష్ రావును అరెస్ట్ చేయాలని ఆయన అన్నారు. అధికారం ఉంది కదా అని తమపై కేసులను పక్కనపెట్టి రాజకీయ కుట్రతో జగ్గారెడ్డి లాంటి వాళ్లను అరెస్ట్ చేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించిన ఉత్తమ్.. కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి ప్రజలు తగిని బుద్ది చెబుతారని అన్నారు.

tags: uttam, uttam on jaggaredy, uttam baout jaggareddy arrestm uttam ob jaggatreddy arrest, uttam meet dgp, uttam meet jaggareddy

Related Post