కంభంపాటి రిజైన్‌...?

news02 April 17, 2018, 10:52 a.m. political

విజ‌య‌వాడ: ఎపీ బిజెపి అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు పంపించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో పార్టీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన కంభంపాటి..త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీడీపీతో స‌ఖ్య‌త మెలిగారు. అయితే గ‌త కొద్ది కాలంగా ఎన్డీయేలో బాగ‌స్వామిగా ఉన్న టీడీపీ..బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో అప్ప‌టి నుంచి బిజెపి టీడీపీ మ‌ధ్య స‌ఖ్య‌త కొర‌వ‌డింది.  ఇరు పార్టీలు ఒక్క‌రిపై మ‌రొక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు.  రెండు ప‌క్షాల నుంచి వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డంపై టీడీపీ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. అంతేకాకుండా బిజెపికి వ్య‌తిరేకంగా న‌ల్ల‌బ్యాడ్జిలు  ధ‌రించి నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తుస్తున్నారు. అయితే ఇంత జ‌రుగుతున్న ఎపీ బిజెపి అధ్య‌క్షుడుగా ఉన్న కంభంపాటి...టీడీపీ నాయ‌కుల‌కు ధీటుగా స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంపై కేంద్ర నాయ‌క‌త్వం అస‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఎపీలో విప‌క్షాల ఆరోప‌ణ‌ల‌కు ధీటుగా బ‌దులిచ్చే నేత‌ను అధ్య‌క్షుని హోదాలో కూర్చొబెట్టాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు కేంద్ర నాయ‌క‌త్వం ఆలోచ‌న విధానాన్ని అర్థం చేసుకున్న కంభంపాటి.. ముందుగానే త‌న రాజీనామా లేఖ‌ను అమిత్ షా కు పంపించిన‌ట్లు స‌మాచారం. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బిజెపి కొత్త అధ్య‌క్షుడు ఏవ‌ర‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం జోరుగా కొన‌సాగుతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితిలో విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు ధీటుగా బ‌దులిస్తూ.. బిజెపిని ముందుండి ఏవ‌రు న‌డిపిస్తార‌నేది  హాట్ టాపిక్ అవుతోంది. 

tags: kambhati,haribabu,kambhampatiharibabu,bjp,apkamalam

Related Post