రాహుల్ లోక్ స‌భ శంఖారావం ..!

news02 March 8, 2019, 9:49 p.m. political

RAHUL GANDHI

హైద‌రాబాద్  : శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ శంషాబాద్ లోని క్లాసిక్ క‌న్వెక్ష‌న్ గ్రౌండ్‌లో జ‌రిగే స‌భ‌లో పాల్గొంటారు. ఉద‌యం క‌ర్ణాట‌క‌లో హుబ్లిలో జ‌రిగే ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్న రాహుల్ అక్క‌డి నుంచి హుబ్లి విమాశ్ర‌యం నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యానికి సాయంత్రం 4 గంట‌ల‌కు చేరుకుంటారు . అక్క‌డ నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో ఆయ‌న 5 గంట‌ల‌కు శంషాబాద్ క్లాసిక్ క‌న్వెన్ష‌న్ గ్రౌండ్ లో జ‌రుగ‌నున్న బ‌హిరంగ‌ స‌భ‌లో పాల్గొనున్నారు. అనంత‌రం రాహుల్ అక్క‌డ నుంచి స‌భ పూర్త‌య్యాక తిరిగి శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకొని ప్ర‌త్యేక విమానంలో డిల్లీకి వెళ‌తారు.

RAHUL GANDHI

tags: RAHUL GANDHI TOUR IN TELANGANA,UTTAM KUMAR REDDY,REVANTH REDDY,RAHUL GANDHI,TELANGANA,AICC,TPCC

Related Post