అసెంబ్లీ ఫ‌లితాల‌కు భిన్నంగా లోక్ స‌భ ఫ‌లితాలు ..!

news02 Jan. 4, 2019, 10:59 p.m. political

SHABBER ALI

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా రాబోయే లోక్ సభ ఫలితాలు ఉంటాయని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత .. ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ అన్నారు. గాంధీభ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న .. కేసీఆర్‌ ఊరసవెల్లిలా రంగులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో కోర్టును సాకుగా చూపి కేసీఆర్‌ బీసీలను మోసం చేశారని ష‌బ్బీర్ అలీ విమ‌ర్శించారు. 

SHABBER ALI

గిరిజ‌నుల‌కు .. ముస్లిమ్ ల‌కు రిజర్వేషన్ల అమ‌లుపై కేసీఆర్ పై నిప్పుల వ‌ర్షం కురిపించిన ష‌బ్బీర్ అలీ .. రిజ‌ర్వేష‌న్స్ పై కేసీఆర్ హామీ ఏమయ్యిందో  చెప్ప‌ల‌ని  డిమాండ్ చేశారు. బీసీలపై ప్రేమ ఉంటే ఎందుకు సుప్రీమ్ కోర్ట్ లో రివ్యూ పిటిషన్‌ వేయలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు . కేసీఆర్‌ అబద్దాలు కొన్ని రోజులే నడుస్తాయని ష‌బ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.

tags: Shabber Ali Serious Comments On KCR,Shabber Ali,Janareddy,Uttamkumarreddy,Revanthreddy,Bhatti Vikramarka,Gandhibhavan,trs bhavan,ktr,harishrao,kavitha trs mps,congress mps,rahul gandhi,soniya gandhi,muslims resversations,st resversations,kcr,ts assembly

Related Post