ఆమె ద‌క్షిణాది న‌టి కావ‌డ‌మే కార‌ణం

news02 May 21, 2018, 11:23 a.m. political

second wife 6

బెంగ‌ళూరు: క‌ర్నాట‌క‌కు కాబోయే ముఖ్య‌మంత్రి జేడీఎస్ అగ్ర‌నేత కుమార‌స్వామి సెకండ్ వైఫ్‌ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలుస్తున్నాయి.  కుమార్‌స్వామి సెకండ్ వైఫ్ రాధిక ప‌లు ద‌క్షిణాది సినిమాల్లో న‌టించిన హీరోయినేన‌ని తెలిసింది. అయితే అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య కుమార స్వామి సీఎం ప‌ద‌వి అధిష్టించ‌నుండ‌డం... ఆయ‌న రెండో భార్య హీరోయిన్ కావ‌డంతో ఇప్పుడు నెటిజ‌న్ల దృష్టి రాధిక‌పై ప‌డింది. జ‌న‌ర‌ల్ గానే కాబోయే సీఎం రెండో భార్య న‌టి కావ‌డంతో నెటిజ‌న్లు ఆమె స‌మాచారం కోసం గూగుల్‌ను జ‌ల్లెడ ప‌డుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు గూగుల్ టాప్ సెర్చ్ ట్రెండింగ్ లో రాధిక ఉండ‌డం విశేషం. రాజ‌కీయాల్లో ఆమె లేకున్నా.. ఆమెకున్న సినీ గ్లామ‌రే రాధిక‌కు దేశ వ్యాప్త గుర్తింపు తేవ‌డం విశేషం. 

second wife-2

రాధిక చిన్న వ‌య‌స్సులోనే చిత్ర సినిమాలోకి అడుగుపెట్టింది. 16వ ఏట‌నే వెండితెర‌పై ఆమె క‌నిపించింది. 2002 సంవ‌త్స‌రంలో రాధిక న‌టించిన నీలమేఘ శ్యామ, నినగాగి, తావరిగె బా తంగీ, ప్రేమఖైదీ, రోమియో జూలియెట్ విడుద‌లై ప్రేక్ష‌కుల్లో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇలా 2002 నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం క‌నీసం 5 సినిమాల‌కు త‌గ్గ‌కుండా ఆమె న‌టించారు. దీంతో ద‌క్షిణాదిలో ఆమె హ‌వా ఏమేర‌కు ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 

second-3

రాధిక తెలుగులో కూడ న‌టించారు. కొబ్బ‌రికాయ కొట్టిన వేళ‌, భ‌ద్రాద్రి రాముడు, కోడిరామ‌కృష్ణ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన గ్రాఫిక్స్ మూవీ అవ‌తారంల‌లో హీరోయిన్‌గా న‌టించారు. అయితే కుమార్ స్వామి సెకండ్ వైఫ్ రాధిక‌కు సినిమా నేప‌థ్యం ఉంద‌ని తెలియ‌డంతో.. నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో ఆమె గురించి పెద్ద ఎత్తున వెత‌క‌డం ఇప్ప‌డు హాట్ టాపిక్‌గా మారింది. మ‌న‌దేశంతో పాటు ఖ‌తార్‌, యూఏఈ, శ్రీ‌లంక‌, కువైట్‌ల‌లో రాధిక గురించి వెతుకుతున్న‌ట్లు గూగుల్ వెల్ల‌డించ‌డం విశేషం. 

tags: radhika,kumaraswamysecond wife,southe indiafilm,bjp,jds,congress,telugumovies,

Related Post