తెలంగాణ జ‌న స‌మితి పార్టీ జెండా ఇదే

news02 April 4, 2018, 4:14 p.m. political

telangana jana samithi jenda

 హైద‌రాబాద్ః తెలంగాణ జ‌న స‌మితి పార్టీ అధ్య‌క్షుడు ప్రొ. కోదండారాం .. సీఎం కేసీఆర్ పై సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు. బాగ్ లింగం ప‌ల్లిలో ఓ ఫంక్ష‌న్ హాల్ లో తెలంగాణ జ‌న స‌మితి జెండా ఆవిష్కరించిన కోదండారాం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అందరి ప్రభుత్వం కోసం ప్ర‌జ‌లంతా ప్రగతిభవన్ గడీలను బద్దలు కొట్టాలని పిలిపిచ్చారు. తెలంగాణ ప్రజాస్వామికరణకు,ఏకతత్వ పాలనకు జరుగుతున్న పోరాటంగా కోదండారాం అభివ‌ర్ణించారు. 1996 నుండి జయశంకర్ సర్ తో  ప్రారంభించిన తెలంగాణ ప్రయాణం ఇప్ప‌టి వ‌ర‌కు 99 కిలీమీట‌ర్లు ప్ర‌యాణించిన‌ట్లు.. ఇక ఒక్క కిలోమీట‌ర్ న‌డిస్తే విజ‌యం సాదించ‌వ‌చ్చ‌ని అన్నారు. భావ వ్యా ప్తి కోసమే పార్టీ అవసరం అనిపించిందని తెలిపారు. ఈనెల‌ 29 న సభతో జ‌న స‌మితి బలం ఏమిటో చూపిస్తామ‌ని స‌వాల్ విసిరారు కోదండ‌రాం.  

telangana janasena party jenda

 తెలంగాణ జన సమితి జెండాను అవిష్కరించారు కోదండరామ్. పాలపిట్ట, ఆకుపచ్చ కలర్ తో కూడిన జెండానే జ‌న‌స‌మితి జెండా గా కోంద‌డారాం ప్ర‌క‌టించారు. పాలపిట్ట, ఆకుపచ్చ కలర్ తో పార్టీ జెండా..మధ్యలో నీలి రంగులో తెలంగాణ చిత్రపటం నడుమ అమరవీరుల స్థూపం ఉండే విదంగా జెండాను రూపొందించారు. 

Related Post