కరుణకు ప్రధాని నివాళి..

news02 Aug. 8, 2018, 11:36 a.m. political

karunanidhi

చెన్నై(నేషనల్ డెస్క్)- తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలిగిపోయాయి. మెరినా బీచ్ లో ఆయన అంత్యక్రితలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు కరుణానిధి అంత్యక్రియలకు మెరినా బీచ్ లో స్థలం కెయాయించాలని తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

karuna

నిబంధనల ప్రకారం మెరినా బీచ్ లో అంత్యక్రియలకు అనుమతి ఇవ్వలేమని అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేయడంతో డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు గతంలో మెరినా బీచ్ లో ఎవ్వరు అంత్యక్రియలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని కోర్టులో దావా వేసిన వ్యక్తులు సైతం తమ పిటీషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత కరుణానిధి అంత్యక్రియలను మెరినా బీచ్ లో నిర్వహించేందుకు అనుమతివ్వాలని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

marina beach

ఇక కరుణానిధి పార్ధీవ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోది, కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తదుతరులు శ్రధ్దాంజలి ఘటించారు. ప్రధాని మోదీ స్టాలిన్, కనిమొళిని ఓదార్చారు. సాయంత్రం ఆరుగంటలకు చెన్నై మెరినా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

tags: karunanidhi, karunanidhi funeral, karunanidhi funeral in marina beach, hi court green signal on karunanidhi funeral, pm floral tributes to karunanidhi, karunanidhi body in rajaji hall, karunanidhi dead body in rajaji hall

Related Post