పేదలందరికి యేడాదికి 72 వేలు

news02 April 15, 2019, 8:28 a.m. political

rahul

తానకు తాను కాపలాదారుగా చెప్పుకుంటున్న ప్రధాని మోదీ 100 శాతం దొంగే అని ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. దొంగలందరికి మోదీ పేరే ఉంటుంది ఎందుకు అని ప్రశ్నించిన రాహల్.. నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, నరేంద్ర మోదీ. ఇంకెంతమంది మోదీలు బయటికి వస్తారోనని ఎద్దేవా చేశారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణంలో ప్రధాని మోదీ 30 వేల కోట్ల రూపాయలను దోచి తన దొంగ స్నేహితుడు అనిల్‌ అంబానీకి కట్టబెట్టారని ఆరోపించారు. మోదీ ఎన్నడూ రైతులు, ఉద్యోగాలు, అవినీతి గురించి మాట్లాడలేదని రాహూల్ మండిపడ్డారు. మోదీలా తాము అబద్ధాలు చెప్పమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే న్యాయ్‌ పథకం ద్వారా దేశంలోని 5 కోట్ల పేద కుటుంబాలకు ఏడాదికి 72 వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని రాహూల్ గాంధీ తెలిపారు. అటు మహిళలకు చట్టసభల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

rahul

గత ఎన్నికల్లో గెలిస్తే పేదల బ్యాంకు ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని మోదీ అబద్ధం చెప్పారని గుర్తు చేసిన రాహూల్.. తాము మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో దేశంలోని పేదల ఖాతాల్లో 3 లక్షల 60 వేల కోట్లు జమ చేస్తామని స్పష్టం చేశారు. తనకు తాను కాపలాదారుగా చెప్పుకొనే ప్రధాని మోదీ బడా పారిశ్రామికవేత్తలకు చెందిన 3 కోట్ల 50 వేల కోట్ల రుణాల్లో ఒక్కపైసా కూడా వసూలు చేయలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బడా పారిశ్రామికవేత్తల ముక్కు పిండి మరీ రుణాలను వసూలు చేసి నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపుతామని రాహూల్ పేర్కొన్నారు. నేను మీ వాడిని.. మీ కోసం పనిచేస్తానంటూ నిరుపేదలకు హామీ ఇచ్చారు రాహూల్ గాంధీ.

tags: rahul, rahul gandhi, rahul election campaign, rahul gandhi election campaign, rahul fire on pm modi, rahul gandhi fie on pm modi, rahul about nyay scheame

Related Post