హైదరాబాద్:కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్‌కుమార్ ఘాటైన విమర్శలు చేశారు. ప్రభుత్వంలో భాగమైన మంత్రి జగదీశ్‌రెడ్డిపై పెద్ద ఎత్తున పత్రికల్లో వరుస కథనాలు వస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించాలన్నారు. ప్రైవేట్ భూములను కొనుగోలు చేసి వాటిని ఎక్కువ ధరకు సర్కారుకు కట్టబెడుతున్న సర్కారులో ఎవరికి పట్టదా.. అని ప్రశ్నించారు. జగదీశ్ రెడ్డిని ప్రభుత్వం కావాలనే కాపాడుతుందని ఆరోపించారు. జగదీశ్ రెడ్డి భూదందాపై చీఫ్ విజిలెన్స్ ఆఫ్ ఇండియా, లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.