ద‌క్షినాది నుండి రాహుల్ పోటీ.

news02 March 23, 2019, 8:10 p.m. political

rahul gandhi,kerala

డిల్లీ : కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అమేథీతో పాటు దక్షిణాది నుంచి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అంటే అవుననే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.కాంగ్రెస్ క‌ష్ట‌కాలంలో ఉన్న ప్ర‌తి సారి.. గాంధి ఫ్యామిలీని ద‌క్షినాది రాష్ట్రాలు గుండెల్లో పెట్టుకోవ‌డం.. ఆత్వ‌రాత కేంద్రంలో అధికారంలోకి రావ‌డం తెలిసిందే. ఇందిరా గాంది.. ఎమర్జెన్సీ త‌ర్వాత 1978 లో క‌ర్నాట‌క‌లోని చిక్క‌మ‌గ‌ళూరులో.. 1999 లో సోనియా గాంధి బ‌ల్లారి నుండి  పోటీ చేసి విజ‌యం సాదించ‌డంతో దీన్నే కాంగ్రెస్ సెంటిమెంట్ గా కూడా భావిస్తుంది. దీంతో.. ఈ సారి రాహుల్  కూడా.. ద‌క్షిణాది నుంచి పోటీ చేయాల‌న్న‌ డిమాండ్ సౌత్ లీడ‌ర్స్ నుండి వ‌స్తుంది. దీనిలో బాగంగా.. క‌ర్నాట‌క‌.. కేర‌ళ రాష్ట్రాల పీసీసీలు ఇప్ప‌డికే రాహుల్ గాందిని త‌మ రాష్త్రాల నుండి పోటి చేయాల‌ని ఆవ్వానించాయి. క‌ర్నాట‌లోని బ‌ల్లారి , చిక్ మ‌గ‌ళూరు నుండి లేదంటే.. మ‌రేదైనా చోట‌నుండి లోక్‌స‌భకు పోటీ చేస్తే.. ద‌క్షినాది రాష్ల్రాల‌పై మంచి ప్ర‌భావం ఉంటుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు ఉంటున్నాయి. ఇప్ప‌డికే  క‌ర్నాట‌క నుంచి కూడా పోటీ చేయాల‌ని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ దినేశ్ గుండూ రావు సైతం రాహుల్‌ను అభ్య‌ర్థించారు.

rahul gandhi, karnataka, kerala pcc, mp elections, aicc
ఇక కేర‌ళ‌లలోని వయనాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి  పోటీ చేయాల‌ని అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ కార్య‌ద‌ర్శి ఊమెన్ చాందీ.. ఇప్ప‌డికే రాహుల్‌ను కోరారు. దీనిపై రాహుల్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే అవ‌కాశాలు ఉన్నాయి. ఖ‌చ్చింత‌గా త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వస్తుందని కేరళ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేరళలో 20 లోక్ సభ స్థానాలు ఉండ‌గా.. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే వయనాడ్  లోక్ స‌భ సీటును పెండింగ్ లో ఉంచ‌డంతో.. కేర‌ళ నుండి రాహుల్ పోటీ చేయ‌డం ఖాయంమ‌న్న చ‌ర్చ సాగుతుంది. మ‌రోవైపు రాహుల్ ..ద‌క్షినాది నుండి పోటీ చేయాల‌ని ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున రిక్వేస్ట్ లు కూడా వ‌స్తున్నాయి. దీంతో రాహుల్ దక్షిణాది లో కేర‌ళ ను ఎంచుకుంటారా..? కర్నాట‌క‌కు జై కొడ‌తారా..? అన్న‌ది ఇప్ప‌డు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
 

tags: rahul gandhi, kerala, karnataka, mp ,vaaynadh, karnataka pcc

Related Post