కావాల‌నే మాపై దుష్ప్రాచారం ..!

news02 Jan. 11, 2019, 8:02 p.m. political

akhila priya

క‌ర్నూల్ : పార్టీ మారుతున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఆంద్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ మంత్రి భూమా అఖిల ప్రియా ..  నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రంహ్మానంద‌రెడ్డిలు స్పందించారు. తాము తెలుగుదేశం పార్టీని వీడే ప్ర‌స‌క్తే లేద‌ని .. ప్రాణం ఉన్నంత‌వ‌ర‌కు తెలుగుదేశం లోనే ఉంటామ‌న్నారు.  తాము పార్టీ మారుతున్నట్టు సోష‌ల్ మీడియాలోనూ .. ఓ టీవీ ఛాన‌ల్ లో వస్తున్న వార్తలను వారు కొట్టి పారేశారు. 

akhila priya

నా చెల్లెల్ని కూడా తీసుకొని నేను జనసేనలోకి వెళ్తున్నానని  ఒక ఛానల్ లో వార్త‌లు ప్ర‌సారం చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు అఖిల ప్రియా. అసలు తెలుగుదేశం పార్టీ .. చంద్ర‌బాబు నాయుడు త‌మ‌ను ఎందుకు దూరం పెడుతుందని ఆమె ప్ర‌శ్నించారు. పార్టీ మారాల్సిన అవసరం నాకేంటని ఆమె అన్నారు. పార్టీకి .. తనకు మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని  అఖిలప్రియ .. బ్రంహ్మానంద‌రెడ్డిలు  స్ప‌ష్టం చేశారు. 

akhila priya

tags: AP Minister Akhila Priya Reaction On Party Changing,akhila priya,bhuma brahmanandareddy,shobha nagireddy,bhumanagireddy,pavan kalyan,chandrababu naidu,ap,tdp,ysrcp,janasena,bjp,congress

Related Post