ఒకేసారి ఎన్నికలకు రెడీ..

news02 Aug. 14, 2018, 8:46 a.m. political

bjp

న్యూ ఢిల్లీ (నేషనల్ డెస్క్)- జమీలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపధ్యంలో బీజేపీ కిలక నిర్ణయం తీసుకుంది. జమీలి ఎన్నికలకు తాము సిద్దమేనని బీజేపీ అధ్యక్షులు అమిత్ షా తెలిపారు. ఈ మేరకు న్యాయ కమీషన్ కు ఆయన లేఖ ఇచ్చారు. వచ్చే యేడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు మరో 11 రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి జరిపేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అమిత్ షా లేఖలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం చివరలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వచ్చే యేడాది జూన్ లోగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్, ఒడిశా, మిజోరాం రాష్ట్రాలను ఎన్నికలు జరగాల్సి ఉంది.

rahul

ఈ రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు అభ్యంతరం లేదని ఇప్పటికే చాలా వరకు పార్టీలు న్యాయ కమీషన్ కు లేఖలు ఇచ్చాయి. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన  వైసీపి, టీఆర్ ఎస్ తో పాటు సమాజ్ వాది పార్టి, అకాళీ దల్, అన్నాడీంకే పార్టీలు సైతం అంగీకారం తెలిపాయి. ఐతే జమీలీ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఆయా రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమండ్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ తో పాటు డీఎంకే, టీఎంసీ, జేడీఎస్, వామపక్ష పార్టీలు జమీలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. 

 

tags: jamili, jamili election, amith shah on jamili, modi on jamili, rahul on jamili, sonia on jamili, pm on jamili, bjp on jamili, congress on jamili, tdp on jamili

Related Post