కారుకు ఓటేస్తే .. క‌మ‌లానికి వేసిన‌ట్టే ..!

news02 March 8, 2019, 9:26 p.m. political

UTTAM KUMAR REDDY

హైద‌రాబాద్ :రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌లు దేశంలో రాహుల్ గాంధీ, న‌రేంద్ర‌మోడి మ‌ధ్య‌నే జ‌రుగుతాయ‌ని, తెలంగాణ‌లో టిఆర్ఎస్‌కు ఓటు వేస్తే అది బిజెపి వేసిన‌ట్టేన‌ని, కారుకు ఓటు వేసినా, క‌మ‌లానికి ఓటు వేసినా ఒక్క‌టేన‌ని అది మురిగిపోయే ఓటు అని టిపిసిసి అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం నాడు ఉత్త‌మ్ త‌న ఇంటి నుంచి చార్మ్ ద్వారా టెలిఫోన్ కాన్ప‌రెన్స్‌లో కాంగ్రెస్ శ్రేణులతో మాట్లాడారు. దాదాపు 25 వేల మంది కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన ఉత్త‌మ్ శ‌నివారం నాడు శంషాబాద్ క్లాసిక్ క‌న్వెక్ష‌న్ గ్రౌండ్‌లో జ‌ర‌గ‌బోయే ఎఐసిసి అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌భ‌కు పెద్ద ఎత్తున త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చారు. బ్లాక్ స్థాయి నుంచి కార్య‌క‌ర్త‌ల‌ను, బ్లాక్ క‌మిటీ స‌భ్యులు పెద్ద ఎత్తున స‌భ‌కు రావాల‌ని, పార్ల‌మెంట్ సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాహుల్ గాంధీ మొద‌టి సారిగా తెలంగాణ‌లో స‌భ‌లో పాల్గొంటున్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌ల‌కాల‌ని ఆయ‌న ఉత్త‌మ్ సూచించారు . రాహుల్ గాంధీ కాబోయే ప్ర‌ధాని అని ఆయ‌న కు తెలంగాణ‌ను నుంచి మెజారిటీ  పార్ల‌మెంట్ స్థానాలు ఇచ్చి తెలంగాణ  భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని ఆయ‌న అన్నారు. న‌రేంద్ర‌మోడి గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లో అనేక అబ‌ద్ద‌పు ప్ర‌చారాలు చేసి ప‌ద‌వి సంపాదించార‌ని, వంద రోజుల‌లో ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని,  విదేశాల‌ను నుంచి న‌ల్లధ‌నాన్ని వెన‌క్కు తెచ్చి ప్ర‌తి పౌరుని ఖాతాలో 15 ల‌క్ష‌ల రూపాయ‌లు జ‌మ చేస్తామ‌ని హామీలు ఇచ్చార‌ని కానీ హామీలు అమ‌లు చేయ‌క‌పోగా, పెద్ద నోట్ల ర‌ద్దు చేసి సామాన్య ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని, యువ‌కులకు ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోగా ఉన్న ఉద్యోగాల‌ను తొల‌గించార‌ని, విదేశాలు తిర‌గ‌డం  త‌ప్ప ఒక్క న‌ల్ల ధ‌నం పైసా వాప‌స్ తేలేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

UTTAM KUMAR REDDY

దేశానికి కాపాల‌దారులా ఉంటాన‌ని ప‌దే ప‌దె చెబుతున్న మోడీ దేశంలో దొంగ‌లా త‌యార‌య్యార‌ని దేశ సంప‌ద‌ను కార్పోయేట్ కంపెనీల‌కు దోచి పెడుతూ పేద‌ల‌కు న‌ష్టం చేస్తు వేల కోట్ల రూపాయ‌లు దోచుకుంటున్నార‌ని పీసీసీ చీఫ్  విమ‌ర్శించారు. ర‌ఫేల్ లాంటి ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన యుద్ద విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున దోచుకున్నార‌ని, చివ‌ర‌కు అత్యంత ర‌క్ష‌ణ‌గా ఉండాల్సిన యుద్ద విమానాల కొనుగోలు ప‌త్రాలు మాయం కావ‌డం మోడీ పాల‌నా అవినీతికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. నేడు తెలంగాణ‌లో కేసిఆర్ మోడీకి పాలేరులా మారార‌ని తెలంగాణ కోసం ఎవ‌రినైనా ఎదిరిస్తాన‌ని చెబుతున్న కేసిఆర్ మోడీ కోస‌మే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ‌లో టిఆర్ఎస్, బిజెపి, ఎం.ఐ.ఎం క‌లిసి చీక‌టి రాజ‌కీయాలు చేస్తుంద‌ని తెలంగాణ ప్ర‌జ‌లు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించి రెండు మ‌త‌త‌త్వ పార్టీల‌తో రాజ‌కీయాలు చేస్తున్న కేసిఆర్‌కు బుద్ది చెప్పి కాంగ్రెస్‌కు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్ర‌ధాని చేయాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు త‌ప్ప ఎవ‌రికి ఓటు వేసినా అది బిజెపికే లాభం చేస్తుంద‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెర‌వేర్చింద‌ని రాహుల్ గాంధీని ప్ర‌ధాన‌మంత్రిని చేసేందుకు ప్ర‌తి కార్య‌క‌ర్త సైనికులా ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు. శ‌నివారం నాడు శంషాబాద్ క్లాసిక్ క‌న్వెక్ష‌న్ గ్రౌండ్‌లో జ‌రిగే రాహుల్ గాంధీ క‌నీస ఆదాయ వాగ్దాన స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు పెద్ద ఎత్తున త‌ర‌లిరావాల‌ని ఆయ‌న అన్నారు. 

UTTAM KUMAR REDDY

tags: UTTAM KUMAR REDDY TELECONFERENCE,RAHUL GANDHI,GANDHI BHAVAN,SONIYA GANDHI,JANAREDDY,REVANTH REDDY,MALLU BHATTI VIKRAMARKA,NARENDRA MODI,PM,AMITH SHA,KCR,TRS,CONGRESS,KTR,KAVITHA,HARISH RAO,AICC

Related Post