లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ Vs మోడీ

news02 Feb. 19, 2019, 11:07 p.m. political

Uttam Kumar Reddy and Lok Sabha elections preparation

ఢిల్లీ : రాబోయే లోక్ సభ ఎన్నికలు రాహుల్ వెర్సెస్ మోడీ ల మధ్యనే వుంటాయని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ పబ్లిసిటీ కమిటీ సమావేశంలో పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు.. పబ్లిసిటీ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి లు పాల్గొన్నారు. ఏఐసీసీ పబ్లిక్ కమిటీ చైర్మన్ ఆనంద్ శర్మ నేతృత్వంలో ఏఐసీసీ వార్ రూం లో ఈ సమావేశం జరిగింది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఐదేళ్ల మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని చెప్పారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికలకు చాలా తేడా వుంటుందని అభిప్రాయపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగానే ముందుకు వెళతామని తెలిపారు. పబ్లిసిటీ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో రాహుల్ గాంధీ ఎప్పుడు పర్యటించాలి అన్నదానిపై కూడా నేతలు చర్చించారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే కాబట్టి సోనియా గాంధీని కూడా తెలంగాణలో పర్యటించాలని కోరారు.

tags: Telangana PCC chief, Kumar Reddy, Jai Shanthi, 2019 assembly election result, Lok Sabha elections, Telangana Lok Sabha elections, Rahul Gandhi, ACC war room, PCC leaders Delhi tour, Sonia Gandhi, PM Modi failures, BJP failures, velappanchavadi Lok Sabha election results, Lok Sabha elections schedule.

Related Post