కేసీఆర్ రిజ‌ర్వేష‌న్ల పేరు చెప్పి మైనార్టీల‌ను మోసం చేశాడు

news02 June 14, 2018, 12:36 p.m. political

uttam ifrar davath

హైద‌రాబాద్: వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి మైనార్టీలు ఒక్క ఓటు కూడా వేయ‌ర‌ని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌, హూజురున‌గ‌ర్‌లలో ముస్లిం సోద‌రులు ఇచ్చిన ఇప్తారు విందుకు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... కేసీఆర్ ముస్లిం సోద‌రుల‌ను దారుణంగా మోసం చేశాడ‌ని విమ‌ర్శించారు. 2014 ఎన్నిక‌ల్లో మైనార్టీల‌కు మాయ‌మాట‌లు చెప్పి కేసీఆర్ ఓట్లు దండుకున్నార‌ని...టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన 4 నెల‌ల్లో 12 శాతం రిజర్వేషన్ ఇస్తామ‌న్న ఆయ‌న...4 ఏళ్లైనా ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ గార‌డీ మాట‌ల‌ను మైనార్టీలు న‌మ్మే ప‌రిస్థితి పోయింద‌ని...వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు మైనార్టీల ఒక్క ఓటు కూడా ప‌డ‌ద‌న్నారు. 

uttam 2

కేసీఆర్‌, మోదీ ఒక్క‌టేన‌ని..మోదీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మైనార్టీల్లో విప‌రీత‌మైన అభ‌ద్ర‌త భావం నెల‌కొంద‌ని తెలిపారు. కేసీఆర్‌,మోదీ ర‌హ‌స్య ఒప్పందంతో ముందుకెళ్లుతున్నార‌ని...అందుకే డిమానిటైజేషన్ రాగానే మోదీకి కేసీఆరే మొద‌ట మ‌ద్ద‌తు తెలిపార‌న్నారు. అంతే కాకుండా కేసీఆర్‌, ఒవైసీ మ‌ధ్య కొన‌సాగుతున్న దోస్తానా కూడా ప‌రోక్షంగా మోదీకే లాభిస్తుంద‌న్నారు. 

uttam iftar davath 3

మోదీ, కేసీఆర్ అనుస‌రిస్తున్న విధానాల‌తో మైనార్టీలెవ‌ర్వూ  బాధ‌ప‌డ‌వ‌ద్ద‌ని...మైనార్టీల‌కు కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసానిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మైనార్టీ అభ్య‌న్న‌త‌కి అన్ని రంగాలుగా స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. ఇవ‌న్ని జ‌ర‌గాలంటే 2019లో మోదీ,కేసీఆర్‌ల‌కు మైనార్టీలు ఓటు వేయ‌కుండా బుద్ధి చెప్పాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. 

 

tags: uttam paticipated in iftar davat,pcc chief uttam kumar reddy,uttam kumar reddy pcc,tpcc uttam kumar reddy,tpcc chief uttam kumar reddy,tpcc president uttam kumar reddy,iftar dawat,iftar dawat sms,iftar dawat invitation,iftar dawat menu,iftar dawat card,iftar dawat ideas,iftar dawat nama,iftar dawat images,munajat e iftar dawateislami,ramadan iftar dawat,iftar ki dawat ka mp3 download,dawat southall iftar buffet,dawat-e-iftar,dawat e iftar invitation,dawateislami iftar time,iftar menu for dawat,iftar ki dawat ka is tarah maza lena,iftar ki dawat ka mp3 song,iftar ki dawat ka,iftar ki dawat ka mp3,iftar ki dawat,iftar ki dawat mp3 iftar ki dawat ka mp3 song download,iftar ki dawat ka song,dawat southall iftar,huzurnagar,huzurnagar pincode,huzurnagar sbi ifsc code,huzurnagar sbh ifsc code,huzurnagar mla,huzurnagar temperature,huzurnagar map,huzurnagar to khammam,huzurnagar population,huzurnagar theatres,huzurnagar which district,huzurnagar andhra bank ifsc code,huzurnagar assembly constit

Related Post