స్వాతంత్రం తెచ్చాం .. తెలంగాణ ఇచ్చాం ..!

news02 Aug. 9, 2018, 10:07 p.m. political

uttam

హైద‌రాబాద్ : ద‌శాబ్దాలుగా తెలంగాణ కోసం మ‌న‌మంతా ఎదురుచూశాము .. కాంగ్రెస్ కృషి వ‌ల్ల .. సోనియ‌గాంధీ ద‌య వ‌ల్ల తెలంగాణ సాధించుకున్నాము .. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే నేడు తెలంగాణ‌లో ఏఐసిసి అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌ర్య‌టిస్తామ‌ని అంటే ఈ ప్ర‌భుత్వం అనేక ఆంక్ష‌లు పెడుతుంది .. ఇదేనా టిఆర్ఎస్ నైతిక‌త .. దేశం నుంచి బ్రిటీష్ వారిని త‌ర‌మివేసిన‌ట్టు తెలంగాణ నుంచి టిఆర్ఎస్‌ను త‌రిమేద్దాం అని పిసిసి అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నాడు గాంధీభ‌వ‌న్ లో క్విట్ ఇండియా దినోత్స‌వం సంద‌ర్భంగా సేవాద‌ళ్ ఆధ్వ‌ర్యంలో క్రాంతి దివ‌స్ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా సేవాద‌ళ్ తెలంగాణ చైర్మ‌న్ క‌నుకుల జ‌నార్ధ‌న్ రెడ్డి నేతృత్వంలో గాంధీభ‌వ‌న్ లో జెండాను ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆవిష్క‌రించారు.

uttam

ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి సాధించిన కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇవ్వ‌డంలో కూడా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లకు అనుగుణంగా కాంగ్రెస్ ప‌నిచేసింద‌ని ఉత్త‌మ్ గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ లో ప‌ర్య‌టిండానికి కేసిఆర్ ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టిస్తుంద‌ని తెలంగాణ ప్ర‌జ‌లు ఈ విషయాల‌ను గ‌మ‌నించాల‌ని ఆయ‌న అన్నారు. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు .. తెలంగాణ ప్ర‌జ‌లు టిఆర్ఎస్‌ను తెలంగాణ‌ను క్విట్ చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర‌మంలో ఏఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌సి కుంటియా, సిఎల్పీ నేత జానారెడ్డి, మండ‌లి విప‌క్ష నేత ష‌బ్బీర్ అలీ, ఎమ్మెల్యే  సంప‌త్ కుమార్‌, ఏఐసిసి కార్య‌ద‌ర్శులు స‌లీమ్‌, న‌గ‌ర అధ్య‌క్షులు అంజ‌న్ కుమార్ యాద‌వ్‌, మాజీ మేయ‌ర్ బండ కార్తీక రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

uttam

ఇక యువ‌జ‌న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా గాంధీభ‌వ‌న్ లో గురువారం నాడు పిసిసి అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి యువ‌జ‌న కాంగ్రెస్ జెండావిష్క‌ర‌ణ చేశారు. యువ‌జ‌న కాంగ్రెస్ అధ్య‌క్షులు అనిల్ కుమార్ యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి యువ‌జ‌న కాంగ్రెస్ వెన్నుద‌న్నుగా ఉంటుంద‌ని అన్నారు ఈ  సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్రమంలో ఏఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌.సి కుంటియా, మండ‌లి విపక్ష నేత ష‌బ్బీర్ అలీ, సిఎల్పీ నేత జానారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం క్విట్ ఇండియా రోజు సంద‌ర్భంగా క్రాంతి దివ‌స్ ను పుర‌స్క‌రించుకొని పిసిసి సేవాద‌ళ్ ఆధ్వ‌ర్యంలో భారీ తిరంగ జెండా ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. సేవాద‌ళ్ చైర్మ‌న్ జ‌నార్ధ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఏఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌.సి కుంటియాతో పాటు పెద్ద ఎత్తున సేవాద‌ళ్ కార్య‌క‌ర్త‌లు, కాంగ్రెస్ నాయ‌కులు, మ‌హిళ‌లు పాల్గొన్నారు. గాంధీభ‌వ‌న్ నుంచి గ‌న్‌పార్క్ వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది.

uttam

tags: Rahul gandhi telangana tour,kcr,telangana govt,rahul gandhi,aicc,soniya gandhi,uttam kumar reddy,uttam with rahul gandhi,aicc meeting,cwc meeting,uttam dilhi tour,uttam padmavathi,janareddy,bhatti vikramarka,telangana congress,t.congress,revanthreddy,shabber ali,uttam bus yathra,gandhibhavan,congress meetings,mahila congress meeting with rahul gandhi,dwakra groups,muslim leaders,ou univercity

Related Post