అడ్డంకులు సృష్టించాలనుకున్నారు

news02 April 12, 2019, 5:22 p.m. political

babu

ఆంద్రప్రదేశ్ లో వందకు వంద శాతం మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిశాక అర్ధరాత్రి టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.తనకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు 130 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవబోతోందని ఈసందర్భంగా చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో రెండో ఆలోచనే లేదని ఆయన స్పష్టం చేశారు. 130 సీట్ల కంటే ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చంద్రబాబు కామెంట్ చేశారు. అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు సీఎం అభినందనలు తెలిపారు.

chandra babu

కౌంటింగ్‌ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలన్న చంద్రబాబు.. స్ట్రాంగ్‌ రూముల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలని నేతలను ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు టీడీపీ శ్రేణులంతా పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్‌తో వైసీపీ నేతలు పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ఇది జగన్, వైసీపీ దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెలుగు దేశం పార్టీ తరపునే ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

tags: babu, cm chandra babu, chandra babu fire om ycp, babu about ap electuons, chandra babu fire on ec, cm chandra babu about election polling, chandra babu fire on election commission

Related Post