ఉదయం 7గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్

news02 April 10, 2019, 7:49 p.m. political

loksabha election 2019

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ లో గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.ఈ మేరకు ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో పాటు మిగతా ఎన్నికల సామగ్రిని పంపిణీ కేంద్రాల్లో అధికారులు సిబ్బందికి అందజేశారు. అనంతరం పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్‌ బూత్‌లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో బయల్దేరి వెళ్లారు. ఎన్నికల నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకంగా ఉండే పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ఇక మొత్తం పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.

loksabha polling

ఇక తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. నిజామాబాద్‌లో మాత్రం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 వేల 603 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, ఇతర సామగ్రితో ఎన్నికల సిబ్బంది తరలి వెళ్ళారు. తెలంగాణలో మొత్తం 2 కోట్ల 96 లక్షల ,97 వేల, 279 మంది ఓటర్లు ఉండగా.. ఎన్నికల బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. నిజామాబాద్ నుంచి అత్యధికంగా 185 మంది.. అత్యల్పంగా మెదక్‌ నుంచి 10 మంది అభ్యర్థులు లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 34 వేల 603 పోలింగ్‌ కేంద్రాల్లో 5 వేల 749 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్‌ చింతమడకలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

tags: election, election 2019, loksabha election, loksabha election 2019, loksabha election polling, loksabha election polling in telangana, loksabha election polling in ap, assembly election polling in ap, andhra pradesh assembly election polling, ap assembly election polling 2019

Related Post