సామాన్యులకు నిరాశే ..!

news02 July 5, 2019, 1:28 p.m. political

Budget

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ 2019-20ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఏన్డీఏ-2 తొలి ప్రభుత్వ బడ్జెట్‌ను ఆమె సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో పూర్తి స్థాయి తొలి మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ రికార్డు సృష్టించారు. నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2014-15తో పోలీస్తే ఆహార భద్రతకు రెట్టింపు నిధులు కేటాయించామన్నారు. 

Budget

-ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చేందుకు 3 అంశాలపై దృష్టి పెట్టాం.

-మౌలిక వసతుల రంగంలో భారీగా పెట్టుబడులు మొదటిది. -డిజిటల్ ఎకానమీ, ఉపాధి కల్పనకు తదుపరి ప్రాధాన్యం.

-స్టాక్ మార్కెట్ లో ఎన్ ఆర్ ఐల పెట్టుబడులకు వెసులుబాటు. -ఎన్ ఆర్ ఐల పెట్టుబడులకు విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపు.

-ప్రపంచంలోనే భారత్ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది. -ఇస్రో సేవలను వాణిజ్యపరంగానూ వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ. -గ్రామాలు, పేదరికం, రైతులే మన గ్రామీణ భారతం.

-గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు. -ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి విద్యుత్. -2022 నాటికి దేశంలోని ప్రతి కుటుంబానికి విద్యుత్ సౌకర్యం. -2022 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లబ్ధి.

-ఇప్పట్నుంచి 2022 వరకు 1.95 కోట్ల ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తాం. -చిల్లర వ్యాపారులకు నూతన పింఛన్ పథకం. -ప్రధానమంత్రి కర్మయోగి మాన్ ధన్ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్. -దేశానికి విదేశీ పెట్టుబడుల రాక స్థిరంగా కొనసాగుతోంది.

-అన్ని దేశాల్లో ఎఫ్ డీ ఐలు తగ్గినప్పటికీ భారత్ పై ఆ ప్రభావం పడలేదు. -ఎఫ్ డీ ఐల ఆకర్షణకు భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతాం. -ప్రపంచంతో పోలిస్తే భారత్ కు ఎఫ్ డీ ఐలు మెరుగ్గా ఉన్నాయి.

-ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా రైల్వేల్లో నూతన విధానం. -2030 నాటికి రైల్వేల మౌలిక వసతుల కోసం రూ. 50 లక్షల కోట్లు అవసరం. -రహదారి, రైల్వే ప్రయాణికులకు ఒకే కార్డును ఉపయోగించుకోవచ్చు. -అదే కార్డుతో ఏటీఎంలలో నగదు కూడా తీసుకోవచ్చు. -భారత్ మాల, సాగర్ మాల, ఉడాన్ పథకాలు గ్రామీణ - పట్టణ ప్రాంతాల మధ్య దూరం తగ్గించనున్నాయి.

-భారత్ మాల పథకం ద్వారా రహదారులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. -నవ భారత్ నిర్మాణానికి 10 సూత్రాల విధానంతో ముందుకెళ్తాం. -దేశ రవాణా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నాం.

-రవాణా వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఉపయోగపడేలా నేషనల్ ట్రాన్స్ పోర్టు కార్డు తెస్తున్నాం. -పవర్ టారిఫ్ పై త్వరలో కొత్త విధానం తీసుకువస్తాం. -ఎంఎస్ఎంఈలకు రాయితీ కోసం రూ. 350 కోట్ల నిధులు. -ఎంఎస్ఎంఈలకు నిరంతర ఆర్థిక వెసులుబాటు కోసం ప్రత్యేక పథకం.

-వన్ నేషన్, వన్ గ్రిడ్ విధానంతో నిరంతర విద్యుత్ సరఫరా. -వృద్ధి రేటు పెంచేందుకు భారీగా మౌలిక వసతులు ప్రాజెక్టులు చేపట్టాం. -దేశ ఆర్థిక వ్యవస్థకు మౌలిక వసతుల ప్రాజెక్టులు జీవనరేఖలు. -భారతీయ సంస్థలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ, సంపద సృష్టిస్తున్నాయి.

-మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్ మా విధానం. -పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తాం. -నూతన అద్దె చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. -దేశంలో 2018-19 మధ్య 300 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం. -దేశంలో మెట్రో రైలు ప్రాజెక్టు పరిధి 657 కిలోమీటర్లకు పెరగనుంది.

-విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం. -దేశ వ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానం. -జలమార్గ్ వికాస్ పథకంతో అంతర్గత జల రవాణాకు అధిక ప్రాధాన్యం. -రోడ్లు, రైలు మార్గాలపై ఒత్తిడి తగ్గించేందుకు జలమార్గ్ వికాస్. -గత ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం.

-పరోక్ష పన్నులు, నిర్మాణ రంగం, దివాళ స్మృతిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. -ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువను లక్ష కోట్ల డాలర్లు పెంచాం. -దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలకపాత్ర పోషిస్తుంది. 

Budget

-5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. -ఎన్డీఏ అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. -ప్రస్తుతం భారత్ 2.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశం.

-జాతీయ భద్రతకు ప్రజలు ఆమోదం తెలిపారు. -3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. -ప్రత్యక్ష పన్నులు, రిజిస్ర్టేషన్ లో అనేక మార్పులు తెచ్చాం. -ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సౌకర్యం, స్వచ్ఛభారత్ నిర్మితమైంది

tags: CENTRAL BUDGET,NIRMALA SETHARAMAN,PM, NARENDRA MODI, PARLIAMENT,RAHUL GANDHI,BJP, CONGRESS,AICC, CENTRAL MINISTERS, AMITH SHA

Related Post