మోడిదీ రాంగ్ ట‌ర్న్ ..నాది రైట్ ట‌ర్న్

news02 Feb. 12, 2019, 12:04 a.m. political

rahul_at_dharma_porata_dharna_at_delh

డిల్లీ -  మోడి.. ఏపీ ప్ర‌జ‌ల సొమ్మును దోచి అంబానీకి క‌ట్ట‌బెట్టార‌ని విరుచుకుప‌డ్డారు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ. దేశానికి కాపాల‌దారుడుగా ఉండాల్సిన ప్ర‌ధానినే.. దొంగ‌గా మారార‌ని ఆరోపించిన రాహుల్.. మోడీతో మోస‌పోయిన ఏపీ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటామ‌ని పున‌రుద్గాటించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న‌తీరుకు నిర‌స‌న‌గా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు  డీల్లీలో చేప‌ట్టిన ధ‌ర్మ పోరాటధీక్ష‌లో పాల్గొన్న‌రాహుల్ .. ధీక్ష‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. ప్ర‌ధాని మోడికి అబద్దాలు చెప్ప‌డం అల‌వాట‌ని.. ప్రధాని స్తాయిలో  మోడి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌మ‌డి ఉండాల‌ని రాహుల్ అన్నారు. .ఏపీ దేశంలో భాగం క‌దా..అని ప్రధానిని ప్ర‌శ్నించారు రాహుల్. ప్ర‌ధాని మోదికి విశ్వ‌స‌నీయ‌త లేనే లేద‌ని అన్న రాహుల్ .. మోడి చోర్ పీఎం మాత్ర‌మే కాదు.. జూటా పిఎం కూడా అని సెటైర్ విసిరారు. ఇక నాడు..భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంట్‌ సాక్షిగా  హోదా హామీని ఇచ్చింది. నాడు ఇచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేర్చాల్సిన భాధ్య‌త కేంద్రంపై ఉంద‌ని ధీక్ష‌లో పాల్గొన్న‌మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ అన్నారు. హోదాపై చంద్ర‌బాబు పోరాటానికి మా సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

/rahul_and_chandrababu_dharna_at_delhi.
ధీక్ష నేస్తున్న‌ చంద్ర‌బాబుకు మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ నిమ్మ‌ర‌సం ఇచ్చిన ధీక్ష‌ను విర‌మింప చేశారు.  ఈ సంధ‌ర్బంగా.. చంద్ర‌బాబు మోడిపై నిప్పులు చెరిగారు.ఏపీకి జ‌రిగిన అన్యాయాన్నిఈ రోజు దేశం అంతా తెలిసిలే చేశామ‌న్న చంద్ర‌బాబు.. మోడి చేసిన‌ మోసం  దేశ ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయింద‌ని అన్నారు. మోడిని మించిన న‌టుడు లేర‌ని ఎద్దేదా చేశారు. ప్ర‌దాని హోదాలో ఉండి.. మోడి ద‌ళారిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారని విరుచుకుప‌డ్డ చంద్రబాబు, తాను తీసుకున్న‌ది ముమ్మాటికి రైట్ ట‌ర్న్, పీపుల్స్ ట‌ర్న్ అని.. మోడిది  రాంగ్ ట‌ర్న్ అని విమ‌ర్శించారు.జ‌గ‌న్ ను ఒడిలో కూర్చోబెట్టుకుని మోడి.. ఏపీని నిలువునా ముంచేశార‌ని దుయ్య‌ప‌ట్టారుజ చంద్ర‌బాబు ధీక్ష బిజేపీ నేత‌లు.. శ‌త్రుజ్ఙ సిన్హా, యంస్వంత్ సిన్హాలతో పాటు.. వివిధ జాతీయ పార్టీల నేత‌లు సంఘీభావం ప‌లికారు. రాహుల్ ,మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్, ఫ‌రూక్ అబ్దుల్లా, ములాయం, శ‌ర‌ద్ యాద‌వ్, శ‌ర‌ద్ ప‌వార్ , కేజ్రీవాల్ ,టిఎంసీ నేత‌లు, ప‌లువురు జాతీయ పార్టీల నేత‌లు పాల్గొని..ఏపీపై కేంద్రం తీరుపై మండిప‌డ్డారు.

devegouda_and_chandrababu.

tags: ap specieal status fight, cm chandrababu stockem dharma porata dheeksha, de;hi, rahul gandhi, farooq abdulla, sharadh pavar, sharadh yaday, mulayam singh, yaswanth sinha, kejriwal, tmc

Related Post