విమానాల్లో..దేశభక్తిని ఇలా చాటుకోవాలి.

news02 March 6, 2019, 7:50 a.m. political

air_india_new_sercular

ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి తర్వాత అందరు పాకిస్థాన్ ,ఉగ్రవాదులపై కాలుదువ్వుతూ ..ఎవరికి వారు తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. ఇప్పడికే ప్రజల్లో దేశభక్తిని పెంచేందుకు ప్రతి సినిమా హాల్లో జాతీయగీతం ను ఆలపిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు వ్యక్తులే కాదు సంస్థలు కూడా దేశభక్తిని నింపే పనికి నడుబిగించాయి. ఈ లిస్ట్ లో చేరిపోయింది ఎయిర్ ఇండియా సంస్థ. ఏకంగా తమ ఉద్యోగుల్లో దేశ భక్తిని నింపేందుకు ఆ సంస్థ ఓ నిర్ణయాన్ని తీసుకుంది.. అవును.. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దేశభక్తిని పెంపొందించేలా ఆదేశాలు జారీ చేసింది. తమ విమాన సిబ్బంది చేసే ప్రతి ప్రకటన తర్వాత ‘జై హింద్’ అనే నినాదం వాడి ప్రకటనను ముగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది .

air_india_new_sercular_2

విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సిబ్బంది ప్రయాణికులకు పలు సూచనలు చేస్తూ ఉంటారు. ప్రయాణికులు సీటు బెల్టు పెట్టుకోవాలని, విమానం టేకాఫ్ అయ్యేముందు ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకండి అంటూ ప్రకటనలు చేస్తుంటారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కూడా ఈ రకమైన ప్రకటనలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ సమయాల్లో 'జైహింద్' అనే నినాదం తప్పక వాడాలంటూ ఎయిరిండియా విమానయాన సంస్థ తమ సిబ్బందికి నిబంధన విధించింది. ఇది దేశభక్తిని పెంపొందించడం మా ప్రయత్నం అంటుంది ఎయిర్ ఇండియా. సంప్రదాయం ప్రకారం విమానంలోకి ప్రయాణికులు ఎక్కేసమయంలో దిగే సమయంలో నమస్కారం చేస్తూ చిరునవ్వుతో పలకరిస్తారు. ఇకనుండి కూడా అదేలా నమస్కారం చేసి చిరునవ్వుతో ప్రయాణికులను పలకరిస్తారని సంస్థ ప్రకటించింది. మొత్తానికి ఎయిర్ ఇండియా అమలు చేస్తున్న ఈ నిబంధనలను మరిన్ని సంస్థలు ఆదర్శంగా తీసుకునే అవకాశం లేకపోలేదు.

tags: air india, flyte, employees, jai hind,Patriotism, pulwama terrar attack, kashmir, pakisthan, pm modi

Related Post