దిగజారి మాట్లాడుతున్నారన్న విమర్శలు..

news02 Oct. 6, 2018, 8:55 a.m. political

kcr

ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బాషపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భాద్యాతాయుతమైన సీఎం పదవిలో ఉన్నప్పుడు హూందాగా వ్యవహరించాల్సిన కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. టీఆర్ ఎస్ భహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడుతున్న తీరు అంతా అసహ్యించుకునేలా ఉందన్న చర్చ జరుగుతోంది, సోషల్ మీడియాలో కేసీఆర్ వాడుతున్న భాషపై మండిపడుతున్నారు చాలా మంది నెటిజన్లు. ప్రతిపక్షాలను తిట్టాలంటే దానికో పద్దతి ఉంటుంది. ఘాటుగా విమర్శలతో విపక్షాలను తిట్టడం రాజకీయాల్లో కొత్తేమి కాదు.  ఆరోపణలు, ప్రత్యారోపణలు, విరమర్శలు, ప్రతి విమర్శలు అందరూ మెచ్చే బాషలో చేయాలి.

kcr

 కానీ కేసీఆర్ మాత్రం మరీ చిల్లర భాషను ఉపయోగించి మాట్లాడటంపై అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నదెవరైనా.. వారిని గౌరవంగా సంబోదించడం రాజకీయాల్లో సంప్రదాయంగా వస్తోంది. కానీ కేసీఆర్ మాత్ర వాడు వీడు అనడమే కాకుండా మాటల్లో చెప్పలేని పదాలు ఉపయోగించడం మరీ దారుణమంటున్నారు. రాజకీయాల్లో సాధారనంగా పార్లమెంట్ బాషలో హూందాగా మాట్లాడాలని చెబుతారు. అసెంబ్లీలో కాని, బయట కాని అన్ పార్లమెంట్ పదాలను ఉపయోగించరాదని అంటారు. కానీ కేసీఆర్ మాత్రం ఇలాంటివేవి పట్టించుకోవడం లేదు. కేవలం ప్రతిపక్ష పార్టీలను తిడితేతో.. చెప్పడానికి వీళ్లేని పదాలను ఉపయోగించి మాట్లాడితేనో ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటున్నారు. నోటికొచ్చిన పదాలన్నీ ఉపయోగించి ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తే ప్రజలు చప్పట్లు కొడతారని కేసీఆర్ భావిస్తున్నారు.

kcr

 కానీ మాటల్లో చెప్పలేని భాషను ఉపయోగిస్తున్న కేసీఆర్ వైఖరిని టీార్ ఎస్ సభల్లోనే ఆ పార్టీ కార్యకర్తలే తప్పుబడుతున్నారు. ఇలాంటి పరుష పదజాలాన్ని ఉపయోగించడం వల్ల మన పార్టీ పరువే పోతుందని.. జనంలో తక్కువైపోతామని సొంత పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రజల్లో టీఆర్ ఎస్ గ్రాఫ్ పడిపోవడంతోనే కేసీఆర్ ఇలా ప్రస్టేషన్ కు గురవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ సారి సుమారు 30మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడుపోక తప్పదన్న సర్వే రిపోర్టులు కేసీఆర్ కు నిద్రపట్టనివ్వడం లేదట. తొందరపడి ముందస్తు ఎన్నికలకు వెళ్లి తప్పుచేశానని బావిస్తున్న కేసీఆర్.. ఈ గందరగోళంలో ఏ మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని టీఆర్ ఎస్ నేతల్లో జరుగుతున్న చర్చ. 
 

tags: public fire on kcr language, kcr language, common people fire on kcr language, kcr dirty language, public fire on kcr dirty language, trs leaders about kcr dirty language

Related Post