మరోసారి అన్నా హజారే దీక్ష

news02 Jan. 31, 2019, 7:08 a.m. political

anna hajare

అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేపట్టారు. లోక్‌పాల్‌, లోకాయుక్త నియామకాల్లో నిర్లక్ష్యానికి నిరసనగా మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగావ్‌ సిద్ధిలో నిరాహార దీక్ష ప్రారంభించారు. మొన్న హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నఅన్నా హజారే తన నిరాహార దీక్ష గురించి అప్పుడే ప్రకటించారు. అవినీతి రహిత ప్రభుత్వం అనే నినాదంతో మోదీ అధికారంలోకి వచ్చారన్న హజారే... ఆయన లోక్‌పాల్‌ బిల్లును అమలు చేస్తారని ఆశించినట్లు చెప్పారు. ఐతే ఐదేళ్లు గడిచిపోయినా.. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదని వాపోయారు. 

anna hajare

మోదీ ప్రభుత్వం కావాలనే లోక్ పాల్ ను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంట్‌లో 2013లోనే ఆమోదం పొందిందని చెప్పిన అన్నా గజారే.. కానీ ఇంత వరకూ లోక్‌పాల్‌, లోకాయుక్తలను నియమించలేదని మండిపడ్డారు. లోక్ పాల్ గురించి ఏ రాజకీయ పార్టీ దీని పట్టించుకోవట్లేదన్న ఆయన.. లోక్‌పాల్‌, లోకాయుక్తలను ఏర్పాటుచేసే వరకూ నిరాహార దీక్ష విరమించబోనని తేల్చిచెప్పారు.

tags: anna hajare, anna hajare strike, anna hajare hunger strike, anna hajare strike about lokpal, anna hajare about lokpal, anna hajare about pm modi

Related Post