భ‌విష్య‌త్ లో కేటీఆర్ యాంక‌రింగ్ చేసుకోవాల్సిందే ..!

news02 May 16, 2018, 11:16 p.m. political

revanth reddy with ktr

హైద‌రాబాద్ : భ‌ర‌త్ అనే నేను సినిమా మంచి హిట్ సాధించింది. ఆ సినిమా మొత్తం రాజ‌కీయ నేప‌థ్యంతో కూడుకున్న‌ది. అందులో హీరో పాత్ర పొలిటీషియ‌న్ గా ఉండ‌గా .. ముఖ్య‌మంత్రి కావ‌డం మ‌రో విషేశం. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరో పేరుకు సంబంధించిన విష‌యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ సినిమాలో హీరో పాత్ర పేరు కేవ‌లం భ‌ర‌త్ గానే ఉండేద‌ట‌. అయితే మ‌న మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ఇన్వాల్వుతో ఆ పేరు కాస్తా .. భ‌ర‌త్ రామ్ గా మారింద‌ట‌.

revanth reddy with ktr

ఈ సినిమాలో హీరో లాగా తాను కూడా అమెరికా నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని .. తాను కూడా రాజ‌కీయాల్లో స‌మూల మార్పుల‌కు ప్ర‌య‌త్నిస్తున్నాన‌నేది కేటీఆర్ ఉవాచ‌. అయితే దానిక‌నుగుణంగా ఆయ‌న న‌డుచుకుంటున్నాడా .. లేదా అనేది అదో పెద్ద చ‌ర్చ‌. అయితే ఈ సినిమాలో హీరో పేరును భ‌ర‌త్ రామ్ గా మార్పించ‌డానికి మ‌న కేటిఆర్ చిత్ర నిర్మాత‌కు బాగానే డ‌బ్బులు ముట్ట‌జెప్పాడ‌ని రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు గుప్పించాడు. 

revanth reddy with ktr

కేటిఆర్ పై పొలిటిక‌ల్ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటిఆర్ పై సెటైర్లు విసిరారు. సినిమా ప్ర‌మోష‌న్లు చేసుకుంటూ .. ఆయా చిత్రాల్లో డ‌బ్బులు పెట్టి హీరోల పాత్ర‌ల పేర్లు మార్పించుకుంటున్న కేటిఆర్ భ‌విష్య‌త్ లో యాంక‌రింగ్ చేసుకోవాల్సిందేన‌ని ఎద్దెవా చేశారు రేవంత్ రెడ్డి. ఇటివ‌ల కేటిఆర్ భ‌ర‌త్ సినిమా ప్ర‌మోష‌న్ లో పాల్గొన్న విష‌యం రేవంత్ మాట‌ల‌కు బ‌లం చేకేరుస్తోంద‌నే చెప్పాలి.

revanth reddy with ktr

Related Post