కేసీఆర్ ఆటలు సాగనివ్వడం..

news02 Oct. 26, 2018, 7:30 p.m. political

uttam

కేసీఆర్ నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి అన్నారు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. విధ్యార్ధుల త్యాగాలతో కుర్చీ ఎక్కిన కేసీఆర్ ఒక్కసారైనా విధ్యార్ధుల సమస్యలను పట్టించుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీ విధ్యార్ధులతో మాట్లాడలేదని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణ ద్రోహి అయిన కేసీఆర్ ను టీఆర్ ఎస్ ను ఈ ఎన్నికల్లో బొంత పెట్టాలని విధ్యార్ధులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో,  యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయలేని అసమర్ధుడు కేసీఆర్ అని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. సీబీఐ పట్ల నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కోఠీలోని సీబీఐ కార్యాలయం ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మహాకూటమి నేతలు ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు ఆర్సీ కుంతియా, టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, సీపీఐ కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, గూడూరు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

uttam

స్వతంత్ర్య ప్రతిపత్తి కలిగిన సీబీఐ ప్రతిష్టను సొంత ప్రయోజనాల కోసం మోదీ మంటకలుపుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. సీబీఐ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన మహాకూటమి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 12న కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అధికారంలోతి రాగానే మొదటి సంవత్సరమే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మోగా డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిరపేద విధ్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వడానికి కేసీఆర్ కు మనసొప్పడం లేదని విమర్శించిన ఉత్తమ్.. తాను మాత్రం వందల కోట్ల రూపాయలతో ఇళ్లు కట్టుకున్నాడని మండిపడ్డారు. ఇక ముందస్తు ఎన్నికలతో కేసీఆర్ తన గొయ్యిని తానే తవ్వుకున్నారని పీసిసి చీఫ్ వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు.

uttam

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ముసుగులో కేసీఆర్ ధన, అధికార దాహం దాగి ఉందని ఉత్తమ్ అన్నారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ కు ఎందుకని ప్రశ్నించిన ఉత్తమ్.. ఏ మొహం పెట్టుకుని తమని కేసీఆర్ అడుగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఓ బచ్చా అన్న పీసిసి చీఫ్.. ఆయనకు పొగరెక్కువ.. పని తక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సాధ్యం కావని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మా హామీలకు 16 రూపాయలు పెంచడానికి సిగ్గూ శరం లేదా అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఖాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, గిరిజ యూనివర్సిటీని సాధించి తీరుతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. అటు ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించి.. లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. టీఆర్ ఎస్ అభ్యర్ధులకు ఒక్కక్కరికి 5కోట్ల రూపాయలను కేసీఆర్ ఇచ్చారని చెప్పిన ఉత్తమ్.. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నంచారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ అక్రమ సంపాదనతో గెలవాలని చూస్తున్నారని.. ఆయన ఆటలు సాగనివ్వమని పీసిసి చీఫ్ హెచ్చరించారు.

tags: uttam, uttam kumar reddy, pcc chief uttam, uttam fire on kcr, uttam fire on trs, mahakutami dharna, uttam dharna at cbi, mahakutami dharna at cbi, uttam fire on pm modi

Related Post