వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

news02 Oct. 8, 2018, 8:19 p.m. political

ఉత్తమ్

కెసిఆర్ ముదనష్టపు పాలనలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కనీసం ఒక్క మహిళకు కూడా మంత్రిగా అవకాశం ఇవ్వని కెసిఆర్ కు మహిళలను ఓటడిగే హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో జరిగిన మహిళా గర్జనలో పాల్గొన్న ఉత్తమ్.. మహిళా సంఘాల డబ్బులను కూడ కెసిఆర్ దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన టీఆర్ ఎస్ పార్టీని బొంద పెట్టాలని ఘాటుగా స్పందించారు. తెలంగాణను లూటీ చేసిన దొంగలు టీఆర్ ఎస్ నేతలని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. టీఆర్ ఎస్ దొంగలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారాయన. ఇక వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పిన పీసిసి చీఫ్.. డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అన్నారు.

ఉత్తమ్

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ద్వాక్రా గ్రూపుకు వడ్డీలేని ..పది లక్షల రుణం ఇసవ్వడంతో పాటు.. ప్రతి సంఘానికి ఉచితంగా లక్ష రూపాయల గ్రాంట్ ఇస్తామని ఉత్తమ్ ప్రకటించారు. ప్రతి మహిళా సభ్యురాలికి ఐదు లక్షల భీమా చేయడమే కాకుండా ..యాక్సిడెంట్ లో చనిపోతే ఐదు లక్షల రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రతి ఇంటికి ఆరు గ్యాస్ సిలిండర్ల ను ఉచితంగా ఇస్తామని చెప్పిన ఉత్తమ్.. రేషన్ లో ప్రతి మనిషికి ఏడు కిలోల సన్నబియ్యం తో పాటు తొమ్మిది వంట సరుకులు అందిస్తామని స్పష్టం చేశారు. ఎస్సి ఎస్టీలకు ఉచితంగా రేషన్ లు ఇవ్వడం .. 200 యూనిట్ వరకు కరెంట్ ను ఉచితంగా అందిస్తామని ఉత్తమ్ తెలిపారు.

ఉత్తమ్

వితంతువులకు , వృద్దులు , ఒంటరి మహిళలకు .చేనేత , బీడీకార్మికులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఇక ప్రభూత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్శన్లను అందిస్తామని చెప్పిన పీసిసి చీఫ్.. వికలాంగులకు మూడువేల పెన్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లో ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలను ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. ఇక ఏడాదిలో రెండులక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఉత్తమ్

ఇక కేసీఆర్ పీసీసీ చీఫ్ ను, కాంగ్రెస్ నేతలను నోటికొచ్చినట్లు మాట్లాడితే .. మేము చూస్తూ ఉరుకోవాలా అని మండిపడ్డారు మాజీ మంత్రి డీకే అరుణ. తాము విమర్శిస్తే కేసీఆర్ , టీఆర్ ఎస్ నాయకులు తట్టుకోలేక పోతున్నారని ఆమె అన్నారు. తెలంగాణ యువత కోసమే సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్న అరుణ.. కేసీఆర్ తన బిడ్డకు తప్ప .. ఏ ఒక్క మహిళకు గౌరవం ఇవ్వడని ఫైర్ అయ్యారు. సోనియా దయతో పదవిలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ లు ఆమెనే అమ్మానా బొమ్మనా అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎలాంటి గడ్డయినా తినే వ్యక్తి కేసీఆర్ అన్న డీకే అరుణ.. కేసీఆర్ ఓ దూరహంకారని... ప్రజలంతా తన బానిసలనుకుంటున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఆలోచించి.. కేసీఆర్ ను గద్దెదింపేందుకు నడుం బిగించాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల ఆత్మ గౌరవాన్ని బజారుకీడ్చిన కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని చెప్పిన అరుణ.. కాంగ్రెస్ పాలనలో మహిళా సంఘాలకు స్వర్ణ యుగం అని అన్నారు. అలంపూర్ నుంచి అదిలాబాద్ వరకు కాంగ్రెస్ గాలి వీస్తుందని.. టిఆర్ఎస్ కు 100 సీట్లు కాదు 10 సీట్లు మాత్రమే వస్తాయని డీకే అరుణ వ్యాఖ్యానించారు.

ఉత్తమ్

tags: ఉత్తమ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్, uttam fire on kcr, uttam in mahila varnana, uttam comments on congress govt, uttam on congress cm swearing, uttam on congress manifesto

Related Post