చంద్రబాబుతో పాటు 14మందికి వారెంట్..

news02 Sept. 14, 2018, 3:22 p.m. political

babu

అమరావతి-ధర్మాబాద్- ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఈ మేరకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ మెజిస్ట్రేట్ కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. చంద్రబాబు తో పాటు మరో 14 మందికి ధర్మాబాద్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈనెల 21లోగా చంద్రబాబు సహా మిగతా 14 మంది కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. 2010లో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు ను పరిశీలించేందుకు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మరియు అతని బృందం వెళ్లింది. దీంతో అనుమతి లేకుండా ప్రాజెక్టు వద్దకు వస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్ వద్ద చంద్రబాబుతోపాటు ఆయన బృందంలో ఉన్న 40మంది ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. 

babu

ఆ తరువాత రెండు రోజుల పాటు ఓ కాలేజ్ భవనంలో నిర్బందించి.. బలవంతంగా అప్పటి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో చంద్రబాబు అండ్ టీం ను హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనకు సంబందించి మహారాష్ట్ర పోలీసులు అప్పట్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న ఈ కేసుకు సంబందించి మహారాష్ట్ర వాసి ఒకరు ధర్మాబాద్ కోర్టులో పిటీషన్ వేశాడు. దీంతో దీనిపై విచారించిన కోర్టు చంద్రబాబు అండ్ టీం కు నోటీసులు జారీ చేసింది. మరి చంద్రబాబు 21లోపు ధర్మాబాద్ కోర్టుకు హాజరవుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీజేపీ సర్కార్ చంద్రబాబుపై కక్ష్య పూరింతగానే ఎనిమిదేళ్ల నాటి కేసును తెరపైకి తెచ్చి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 
 

tags: babu, chandra babu, chandra babu naidu, ap cm chandra babu, dharmabad court notice to ap cm, dharmabad court notice to chandra babu, dharmabad court warrent to chandra babu

Related Post