వాణిజ్య హోదా తొలగింపు

news02 March 5, 2019, 9:24 p.m. political

trump

 

అగ్ర రాజ్యం అమెరికా భారత్ కు షాక్ ఇవ్వడానికి సిద్దమైందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో కీలక ప్రకటన చేసేందుకు రెడీ అయ్యారు. ఎలాంటి సుంకాలు లేకుండా భారత్ కొన్ని వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఆ దేశానికి ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను తొలగించాలని భావిస్తున్నారట. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌ సభ్యులకు ట్రంప్‌ లేఖ రాశారు. ఈ చర్యతో అమెరికా, భారత్ ద్వైపాక్షిక సంబంధాలు బెడిసికొట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీఎస్‌పీ ప్రోగ్రామ్‌ కింద అమెరికా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యత వాణిజ్య హోదా కల్పిస్తూ వస్తోంది. ఆ దేశాల జాబితాలో మన దేశం కూడా ఉంది. దీని ద్వారా అమెరికా మార్కెట్లలోకి కొన్ని వస్తువులను ఎలాంటి సుంకాలు లేకుండా ఎగుమతి చేసేందుకు భారత్ కు అవకాశం దక్కింది. ఇప్పుడు సదరు ప్రత్యేక హోదాను తొలగిస్తే.. భారత్‌ నుంచి ఎగుమతి చేసే అన్ని వస్తువులకు అమెరికా సుంకాలు విధిస్తుందన్న మాట. దీనిపై ఏంచేయాలన్నదానిపై భారత్ సమాచోచనలో పడిందని తెలుస్తోంది. 
 

tags: trump, trump about india, trump on india economic, trump about india economic affairs, america about india economic policy

Related Post