తెలంగాణలో ఫాంహౌస్ తప్ప ఏం కట్టించారు

news02 Dec. 3, 2018, 8:18 p.m. political

rahul

ఐదు సంవత్సరాల క్రితం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకున్నారని ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ చెప్పారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం ఓ సభలో ఒక యువకుడు కేసీఆర్ ని ప్రశ్నిస్తే నీకు కాదు ని బాప్ కి చెప్తా అన్నారని రాహూల్ గుర్తు చేశారు. కేసీఆర్ అధికారం ఉండాలంటే యువతకు, ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని.. కేసీఆర్ అంటే కావో కమిషన్ రావు అని రాహూల్ కొత్త అర్ధం చెప్పారు. కేసీఆర్ కి అధికారం ఇచ్చింది, తెలంగాణ సాధించింది యువత కాబట్టి వాళ్లకు కూడా కెసిఆర్ సమాధానం చెప్పాలని రాహూల్ డిమాండ్ చేశారు. లోక్ సభలో అవిశ్వాసం, ప్రెసిడెంట్ ఎన్నిక సమయంలో తామంతా మోడీ వ్యతిరేకంగా ఉంటే కేసీఆర్ మాత్రం మోడీకి సహకరించారని రాహూల్ మండిపడ్డారు. నరేంద్రమోదీ, ఆరెస్సెస్ కి బీ-టీమ్ గా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆరెస్ పార్టీకి మరో పేరు ఉందని చెప్పిన రాహూల్.. అదే తెలంగాణ ఆర్ ఎస్ ఎస్ అని వ్యాఖ్యానించారు. దేశాన్ని అమ్మడానికి నరేంద్రమోదీ, కేసీఆర్ లు కంకణం కట్టుకున్నారని రాహూల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ లో కేసీఆర్, ఎంఐఎం ని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని చెప్పారు. 

rahul

తెలంగాణ లో కేసీఆర్ ని ఓడించి, తరువాత దేశంలో మోడీని తరమాలని రాహూల్ పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు అసత్య వాగ్దానాలు చేస్తూ మోసం చేస్తున్నారని రాహూల్ గాంధీ మండిపడ్డారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెహమత్ నగర్ ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తోపాటు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, వి హనుమంతరావు, టిటిడిపి ప్రెసిడెంట్ యల్ రమణ, తదితరులు పాల్గొన్నారు. ఇక జూబ్లీహిల్స్ లో ఎంత ధనికులు ఉన్నారో అంత కటిక పెద్దవాళ్ళు ఉన్నారని టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. ప్రజలకు సేవచేసేందుకు మహాకూటమిని ఏర్పాటు చేసామని.. కామన్ మినిమమ్ కార్యక్రమం కోదండరాం ఆధ్వర్యంలో ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న రమణ.. తెలుగు ప్రజలకు ప్రపంచంలో ఎక్కడ కష్టం వచ్చినా చంద్రబాబు అక్కడ ఉంటారని అన్నారు. సీఎం కేసీఆర్ నిజమైన ముఖ్యమంత్రి అయితే... చార్మినార్ దగ్గరికి వెళ్లి ఈ రాష్ట్రానికి, ఓల్డ్ సిటీకి కూడా నేనే సీఎం అని చెప్పాలని సీపీఐ నేత నారాయణ సవాల్ విసిరారు. ఎంఐఎం ను చుసి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

rahul

ఆనాడు మెట్రో ని అడ్డుకోవడానికి కేసీఆర్ నాకు ఫోన్ చేసి సపోర్ట్ చెయ్యమన్నారని గుర్తు చేసిన నారాయణ..  మెట్రో వద్దుని అడ్డుకున్నది కేసీఆరేనని మండిపడ్డారు. 2009 లో టీడీపీ తో పొత్తుపెట్టుకున్న కేసీఆర్ కు.. ఇవ్వాళ మేము కలిస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. దేశంలో మోడీ ప్రభుత్వం మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తోందన్న నారాయణ.. డిసెంబర్ 11 తరువాత కేసీఆర్ ఫామ్ హౌస్ కి పోయి వంకాయలు కోసుకుంటూ ఉండాలని చెప్పారు. ఇక తాను మొదటిసారి సీఎం అయినప్పుడు ప్రతిపక్ష నేతగా పీజేఆర్ ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. పీజేఆర్ ప్రజల మనిషని.. ప్రజల కోసం పనిచేసే వారని ఆయన చెప్పారు. పీజేఆర్ మరణించినప్పుడు ఆయన స్థానంలో టీడీపీ పోటీకి పెట్టలేదన్న చంద్రబాబు..  టీఆరెస్ మాత్రం అడ్డుపడిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మాట్లాడితే చంద్రబాబును తిడుతాడు.. అసలు కేసీఆర్ తెలంగాణలో కట్టింది ఏంటి ఫామ్ హౌస్ తప్ప అని మండిపడ్డారు. నరేంద్రమోదీ ఎప్పుడూ ఎన్నికల్లో తిరుగుతాడన్న చంద్రబాబు... మోడీ ఎన్నికల ప్రధాని తప్ప ప్రజల ప్రధాని కాదని ఎద్దేవా చేశారు. అన్ని మతాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ టీడీపీ పార్టీలదని చెప్పారు.

tags: rahul, aicc chief rahul, rahul gandhi election campaign, rahul gandhu election campaign in hyderabad, rahul gandhi hyderabad election campaign, rahul fire on kcr and modi

Related Post