రాహుల్ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందుకు దొంగ‌నాట‌కాలు ..!

news02 Aug. 9, 2018, 10:57 p.m. political

uttam

హైద‌రాబాద్ : ఏఐసిసి అధ్య‌క్షులు రాహుల్ గాంధీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం తెలంగాణ‌కు వ‌స్తుంటే తెలంగాణ ప్ర‌భుత్వం దొంగ నాట‌కాలు ఆడుతూ అడ్డుకునేందుకు కుట్ర‌లు ప‌న్నుతుంద‌ని .. రాహుల్ వస్తుంటే టిఆర్ఎస్ వెన్నులో చ‌లిపుడుతుంద‌ని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత‌కు తెలంగాణ‌లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చే హ‌క్కు లేదా .. ఇదేనా ప్ర‌భుత్వ ప‌నితీరు అని పిసిసి అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం నాడు ఆయ‌న గాంధీభ‌వ‌న్ లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ నెల 13, 14 తేదీల‌లో రాహుల్ గాంధీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారని ఇక నుంచి ప్ర‌తి నెల రోజున్న‌ర స‌మ‌యం తెలంగాణ‌లో కేటాయిస్తార‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ సారి ప‌ర్య‌ట‌న‌లో మ‌హిళ‌లు, సెటిల‌ర్లు, కాంగ్రెస్ క్యాడ‌ర్‌, ఎడిట‌ర్లు, యువ పారిశ్రామిక వేత్త‌లు, ముస్లీం మేదావులు, విద్యార్ఙి, యువ‌జ‌న సంఘాల ప్ర‌తినిధుల‌తో వివిధ ర‌కాల కార్య‌క్ర‌మాల‌లో స‌మావేశం అవుతార‌ని ఆయ‌న వివ‌రించారు. 

uttam

13వ తేదీన బీద‌ర్‌లో ఒక స‌భ‌లో పాల్గొన్న అనంత‌రం రాహుల్ నేరుగా హైద‌రాబాద్‌కు వ‌స్తార‌ని శంషాబాద్ నుంచి కాంగ్రెస్ ప్రజా చైన‌త్య యాత్ర బ‌స్సులో రాజేంద్ర‌న‌గ‌ర్ కు వెళ‌తార‌ని ఆయ‌న తెలిపారు . అక్క‌డ దాదాపు 15 వేల మంది మ‌హిళ‌ల‌తో స‌మావేశ‌మై ప్ర‌సంగిస్తార‌ని ప‌లువురు మ‌హిళా ప్ర‌తినిధుల‌తో కూడా చ‌ర్చిస్తార‌ని ఆయ‌న చెప్పారు . రాజేంద్ర‌న‌గ‌ర్ క్లాసిక్ గార్డెన్‌లో జ‌రిగే స‌భ‌లో చ‌ట్ట స‌భ‌ల‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల అంశాల‌తోపాటు తెలంగాణ‌లోని 70 లక్ష‌ల మంది మ‌హిళ‌ల‌నుద్దేశించి ప్రసంగిస్తార‌ని, దేశంలో మోడీ మ‌హిళా బిల్లును అడ్డుకుంటున్నార‌ని ఇక్క‌డ కేసిఆర్ ఒక్క మహిళ‌కు కూడా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని ఇద్ద‌రు మ‌హిళా వ్య‌తిరేకుల‌ని వివ‌రిస్తార‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో 6 లక్ష‌ల మ‌హిలా గ్రూపుల‌లో దాదాపు 70 ల‌క్ష‌ల మంది మహిళ‌లున్నార‌ని వారి ఆర్థిక ప్ర‌గ‌తి గురించి రాహుల్ మాట్లాడుతార‌ని స్ప‌ష్టం చేశారు . 

uttam

అలాగే శేరిలింగంప‌ల్లిలో సెటిల‌ర్ల ల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తున్నామ‌ని కాంగ్రెస్ పార్టీ విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న ప్ర‌తి అంశంలో పోరాటం చేస్తుంద‌ని అయితే టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ విభ‌జ‌న చ‌ట్టం త‌న క‌నుస‌న్న‌ల‌లో జ‌రిగింద‌ని చెప్పుకుంటు ఏపి ప్ర‌త్యేక హోదాను మాత్రం వ్య‌తిరేకించ‌డం ఏ ర‌క‌మైన రాజ‌కీయం అని ఆయ‌న విమ‌ర్శించారు.  హైద‌రాబాద్‌లో ఉన్న సెటిల‌ర్స్ ప‌ట్ల కాంగ్రెస్ పార్టీ భ‌రోసా ఇస్తుంద‌ని అవ‌స‌ర‌మైతే వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కూడా ఇస్తామ‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ స‌మావేశం త‌రువాత రాహుల్ బేగంపేట‌లో హ‌రిత ప్లాజాలో బ‌స చేస్తార‌ని మ‌రుస‌టి రోజు 14వ తేదీన ఉద‌యం రాష్ట్రంలో దాదాపు 38 వేల మంది కాంగ్రెస్ క్యాడ‌ర్‌తో బూత్ క‌మిటీ అధ్యక్షులు, మండ‌ల అధ్యక్షులు, జిల్లా అధ్య‌క్షులు, ఆఫీస్ బేర‌ర్లు త‌ద‌త‌రుల‌తో కాంగ్రెస్‌పార్టీ ఏర్పాటు చేయ‌బోయే టెలికాన్ప‌రెన్స్ ద్వారా నేరుగా మాట్లాడుతార‌ని ఇలాంటి సౌకర్యం ఇంత‌వ‌ర‌కు ప్ర‌పంచంలో ఏ రాజ‌కీయ పార్టీకి లేద‌ని ఆయ‌న వివ‌రించారు. త‌రువాత తెలంగాణ‌లోని ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాల‌కు చెందిన ఎడిట‌ర్ల‌తో ప్రత్యేకంగా హ‌రిత ప్లాజాలో స‌మావేశం అవుతారు, అక్క‌డ నుంచి యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గ‌నైజేష‌న్ ఏర్పాటు చేసిన స‌మావేశంలో తాజ్‌కృష్ణ‌లో పాల్గొంటారు. 

uttam

అయితే ప్ర‌భుత్వం ఉస్మానియా యునివ‌ర్శిటీలో రాహుల్ పాల్గొన‌కుండా అడ్డుకుంటుంద‌ని, గ‌తంలో కేసిఆర్‌ను టిఆర్ ఎస్ నాయ‌కుల‌ను విద్యార్థులు అక్క‌డికి రానీయ‌లేద‌ని అక్క‌సుతోనే కుట్ర పూరితంగా అడ్డుకుంటుంద‌ని విసీ ఇంత‌వ‌ర‌కు విద్యార్థులు ఇచ్చిన విన‌తిపత్రంపైన ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అన్నారు. ఇది రాజ‌కీయ స‌భ కాద‌ని ఒయూలోని 18 విద్యార్థి సంఘాలు రాహుల్ గాంధీని ఆహ్వనించాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అలాగే నాంప‌ల్లిలో స‌భ కోసం ముందుగా హ‌కీ గ్రౌండ్ ఇస్తామ‌ని అక్క‌డి నిర్వాహ‌కులు ఒప్పుకున్నార‌ని త‌రువాత వారు ఇవ్వ‌లేమ‌ని చెప్పార‌ని ఇదంతా ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర‌లో భాగ‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

uttam

టిఆర్ఎస్ , బిజెపిల చీక‌టి పొత్తులు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు తాము కేంద్రంతో పోరాడుతున్నామ‌ని చెప్ప‌కొస్తున్న టిఆర్ఎస్ అస‌లు రంగు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింద‌ని ఉత్త‌మ్ విమ‌ర్శించారు. ఆయ‌న గురువారం నాడు గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల‌లో కూడా టిఆర్ఎస్ బిజెపి అభ్య‌ర్థికే ఓటు వేసింద‌ని ఏ ఒప్పందంతో కేసిఆర్ బిజెపికి మ‌ద్ద‌తు ఇచ్చారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కేసిఆర్‌కు బిజెపికి ఒప్పందాలున్నాయ‌ని అందుకే నోట్ల ర‌ద్దు నుంచి మొద‌లుకొని జిఎస్టీ , రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌లాంటి అనేక అంశాల‌లో బిజెపికి టిఆర్ఎస్ మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

uttam

కేసిఆర్ మోడీకి చెంచాగిరి చేస్తున్నార‌ని తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టి స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద‌పీట వేస్తున్నార‌ని విమర్శించారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న ఒక్క అంశంపైన కూడా పోరాటాలు చేయ‌డం లేద‌ని హైకోర్టు విభ‌జ‌న‌, ఎయిమ్స్, ఐఎఎం, భయ్యారం ఇనుప ప‌రిశ్ర‌మ‌, కాజీపేట కోచ్ ప్యాక్ట‌రీ, ఐటిఐఆర్ త‌దిత‌ర హ‌క్కుల విష‌యంలో ఎందుకు టిఆర్ఎస్ పోరాటాలు చేయడంలేద‌ని, ముస్లీం రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కేంద్రం వ‌ద్ద పోరాటాలు చేయ‌కుండా బిజెపితో లాలుచి ప‌డుతుంద‌ని ఈ విష‌యాల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని ఆయ‌న అన్నారు రాబోయే ఎన్నిక‌ల‌లో టిఆర్ఎస్ తెలంగాణ‌లో అడ్ర‌స్ లేకుండా పోతుంద‌ని ఆయ‌న అన్నారు. 

uttam
 

tags: Rahul gandhi telangana tour,rahul gandhi,aicc,soniya gandhi,uttam kumar reddy,uttam with rahul gandhi,aicc meeting,cwc meeting,uttam dilhi tour,uttam padmavathi,janareddy,bhatti vikramarka,telangana congress,t.congress,revanthreddy,shabber ali,uttam bus yathra,gandhibhavan,congress meetings,mahila congress meeting with rahul gandhi,dwakra groups,muslim leaders,ou univercity,uttam fire on kcr,kcr govt,ktr,kavitha,harishrao,telangana bhavan,modi,bjp,amith sha

Related Post