ముఖ్యనేతలతో ఉత్తమ్ సమీక్ష ..

news02 April 12, 2019, 8:19 p.m. political

Uttam kumar

హైదరాబాద్ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా అనుకూల, ప్రతికూల పరిస్థితి లపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, అందుబాటులో ఉన్న ముఖ్యనేతల తో సమీక్షా సమావేశం విర్వహించారు. ఈసమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, అజారుద్దీన్, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య , చిన్నారెడ్డి, వంశీ చందర్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్, దామోదర రాజనర్సింహ పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరైయ్యారు.

Uttam kumar

సమావేశం అనంతరం ఉత్తమ కుమార్ రెడ్డ్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పిటిసి అభ్యర్థులఎంపిక బాధ్యతలను మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, నియోజక వర్గ బాద్యులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలను గ్రామ మండల, జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయాలి కార్యకర్తలకు పిలుపు నిచారు.15వ తేదీ లోగా మండల అధ్యక్షులు సమావేశం పెట్టి అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.మండల అధ్యక్షులు, నియోజక వర్గ బాధ్యులు ఎక్కడైనా లేని పక్షంలో జిల్లా నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థుల విషయంలో పీసీసీ ఎంపిక చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Uttam kumar

tags: UTTAM KUMAR REDDY, KUNTIYA, REVANTH REDDY,KUSUM KUMAR,PONNALA LAXMAIAH,SHABBER ALI, GANDHIBHAVAN,UTTAM KUMAR REDDY REVIEW,MP ELECTION,AICC,LOCAL BODY ELECTIONS

Related Post