మంత్రి ఈటెలకూ తప్పని నరసనలు..

news02 Oct. 26, 2018, 8:21 p.m. political

etela

ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీఆర్ ఎస్ నేతలకు ఎక్కడికక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గ్రామస్థులు టీఆర్ ఎస్ నేతలను తరిమి తరిమి కొడుతున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నడూ తమ గ్రామం మొహం చూడని టీఆర్ ఎస్ నేతలు.. ఇప్పుడెందుకు వచ్చారని నిలదీస్తున్నారు. ఇన్నాళ్లు తమ కష్ట సుఖాలు.. తమ గ్రామ అభివృద్ది పట్టించుకోని వారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారని టీఆర్ ఎస్ నేతలపై మండిపడుతున్నారు ప్రజలు. దీంతో టీఆర్ ఎస్ నేతలు ఎన్నికల ప్రచారానికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇక ఇప్పటి వరకు టీఆర్ ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులకే పరిమితమైన నిరసన సెగలు తాజాగా మంత్రి ఈటల రాజేందర్ కు  తాకాయి. 

etela

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఈటెల.. పట్టణంలోని గాంధీనగర్‌ లో ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. అదే కాలనీకి చెందిన పలువురు మహిళలు మంత్రి ఈటెల రాజేందర్ ను అడ్డుకున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో మాకేం చేశారంటూ మహిళలు ప్రశ్నించారు. స్థానిక నాయకులు మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ఈటెల  గో బ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డబల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఎవరికి ఇచ్చారంటూ స్థానిక మహిళలు ఈటలను నిలదీయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు మొహం చూపించని మంత్రి.. ఇప్పుడు ఓట్లు అడగటానికి ఏ మొహం పెట్టుకుని వచ్చారని ఈటెలపై మహిళలు మండిపడ్డారు. దీంతో చేసేది లేక అక్కడినుంచి వెనుదిరిగారు ఈటెల రాజేందర్.

tags: etela rajender, etala rajender, people protest on etala rajender, public protest on etala rajender, huzurabad public protest on etala rajender

Related Post