టీఆర్ ఎస్ ది రాజకీయ వ్యభిచారం

news02 June 6, 2019, 6:37 p.m. political

uttam

తెెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూని అవుతున్న సందర్బంగా రేపు (జూన్ 7) ఉదయం 11 గంటలకు అన్ని జిల్లా  కేంద్రాలతో పాటు.. అన్ని నియోజక వర్గ కేంద్రాలలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాలని చెప్పారు. అసెంబ్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్ట్ లను ఖండించాలని అన్నారు. తెలంగాణలో విచ్చలవిడిగా రాజకీయ ఫిరాయింపులు చేస్తూ టిఆర్ఎస్ రాష్ట్రంలో రాజకీయ వ్యబిచారం చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ దిగజారుడు రాజకీయాలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.  ప్రజాస్వామ్య వాదులు, మేధావులు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ విచ్చలవిడి తనంపైన స్పందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
 

tags: uttam, pcc chief uttam, uttam kumar reddy, uttam statment about protest, uttam announced protest against kcr, uttam announced protest against trs, uttam fire on mc kcr

Related Post