సూప‌ర్ స్టార్‌కు చేదు అనుభ‌వం

news02 May 31, 2018, 2:02 p.m. political

rajani kanth

చెన్పై: సాధార‌ణంగా త‌మిళ‌నాడులో సినీ తారల‌ను దేవుళ్లుగా భావించే విష‌యం తెలిసిందే. అందునా సూప‌ర్ స్టార్‌ ర‌జ‌నీకాంత్ అంటే ఫ్యాన్స్‌కు ఎంత అభిమాన‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న కోసం త‌మిళ‌నాడులోని ప‌లు ప్రాంతాల్లో గుళ్లు కూడా క‌ట్టిన సంద‌ర్భాలున్నాయి. అయితే అలాంటి ర‌జ‌నీకాంత్‌కు సొంత రాష్ట్రంలోనే ప‌రాభ‌వం ఎదురైంది. తూత్తుకూడి అల్ల‌ర్ల బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లి ఆయ‌న‌కు సంతోష్‌ రాజ్‌ అనే బాధితుడు నీళ్లు తాగించ‌డంటా..! 

rajani kanth 2

ఇప్పుడు ఇదే విష‌యం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. రజనీ...సంతోష్‌ను ప‌రామ‌ర్శిస్తుండ‌గా ‘మీరెవరు అని’ ఆశ్చ‌ర్యంగా ప్ర‌శ్నించ‌డంటా..! అంతేకాదు ఇంతకు ముందెన్న‌డూ మీ మొహం నేనేరుగ‌నని చెప్పేశాడంటా...! దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన ర‌జ‌నీకాంత్ న‌వ్వి మెల్ల‌గా అక్కడి నుంచి జారుకున్నాడంటా..! ఇంక ఇక్క‌డే ఉంటే త‌న కొంప మున‌గ‌డం ఖాయ‌మ‌ని అక్క‌డి వెళ్లిపోయాడంటా... ఇప్పుడు ఇదే విష‌యం గూగుల్ ట్రెండింగ్‌లో కొన‌సాగుతోంది. ‘నాన్‌ రజనీకాంత్‌’ అన్న హ్యాష్‌ట్యాగ్ తో ట్రెండింగ్‌లో నిల‌వ‌డం విశేషం. 

rajani kanth 3

అయితే సంతోష్ కామెంట్స్‌ను ఆస‌రాగా చేసుకొని కొంద‌రు భాషాపై సెటైర్లు వేయ‌డం కొస‌మెరుపు. ద‌క్షిణాది అంత‌టా తెలిసిన సూప‌ర్ స్టార్‌ను సొంత రాష్ట్రంలోనే గుర్తించ‌కోపోవ‌డం విడ్డూరంగా ఉంద‌ని పోస్టులు పెడుతున్నారు. పాపం ర‌జ‌నీకి ఇప్పుడే రాజ‌కీయ క‌ష్టాలు మొద‌లైన‌ట్లున్నాయ‌ని సెటైర్లు వేస్తూ.. వేల‌కోలం చేస్తున్నారు. 

tags: rajani,super star,chennai, social media, tutttukoodi, santhosh

Related Post