దక్షిణాదిపై మోదీ చిన్నచూపు..

news02 Oct. 31, 2018, 4:45 p.m. political

modi

తెలుగు వారిపై అడుగడుగునా వివక్ష చూపుతూ వస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... మరోసారి తెలుగు వారిపై చిన్నచూపు చూసింది.  ఈ సారి ఒక్క తెలుగు వారిపైనే కాదు.. దిక్షిణాది రాష్ట్రాలపై మోదీ సర్కార్ వివక్షకు చాటుకుంది. దేశ ఐక్యతకు చిహ్నంగా ప్రపంచమంతా తెలిసేలా అట్టహాసంగా ప్రధాని మోదీ ఆవిష్కరించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్ర శిలా ఫలకంలో తెలుగు భాషకు చోటు లేకుండా పోయింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఐక్యతకు చిహ్నం అని గొప్పగా చెప్పుకుంటున్న మోదీ సర్కార్..  తెలుగు బాషను ఎందుకు మరిచిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పటేల్ విగ్రహ శిలా పలకంలో పది బాషలకు చోటిచ్చిన మోదీ ప్రభుత్వం.. అందులో తెలుగుకు గాని, కన్నడ, మలయాళానికి గాని చోటివ్వలేదు. దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలున్నా.. తెలుగు బాషను మాత్రం మరిచిపోయారు. 

modi

ఇక తమిళ బాషకు చోటిచ్చినా.. అందులో తప్పులున్నాయని వెంటనే చెరిపేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. మోదీకి దక్షిణాది రాష్ట్రాలంటే ఎంత చిన్న చూపో మరోసారి తెలిపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దేశంలో అత్యధిక శాతం మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉన్నా.. మోదీ ప్రభుత్వం మాత్రం గౌరవించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ కావాలనే తెలుగు భాషను పట్టించుకోలేదంటూ భాషాకోవిదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ ఐక్యతకు చిహ్నంగా చెబతున్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం శిలా ఫలకంపై దక్షిణాది భాషలకు చోటెందుకు కల్పించలేదని సోషల్ మీడియాలో అంతా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.దేశ ఐక్యతకు చిహ్నం అంటే ఇదేనా అని మోదీని ప్రశ్నిస్తున్నారు.

tags: modi, pm modi, people fire on modi, common people fire on modi, no telugu language in patel statue inaugural board

Related Post