ఎన్నికల తరువాత కేటీఆర్ అమెరికాకే..

news02 Sept. 13, 2018, 5:27 p.m. political

uttam

తెలంగాణను రక్షించుకునేందుకు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ వెళదామని నిర్ణయించామని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు సీపీఐ, టీడీపీ పార్టీలతో చర్చించామని చెప్పిన ఆయన.. పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై ఇంకా చర్చించలేదని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎలాగూ సన్యాసం తీసుంటారని ఎద్దేవా చేసిన ఉత్తమ్.. కేటీఆర్ అమెరికా వెళ్లిపోతారని చెప్పారు. తెలంగాణలో టీచర్లను కేసీఆర్ నాలుగేళ్లుగా మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సిపీఎస్ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 

uttam

వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో పే రివిజన్ కమీషన్ అమలు చేస్తామని చెప్పిన ఉత్తమ్.. మెగా డీఎస్సీని వేసి మొత్తం 20వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ రంగంలో మొత్తం లక్ష ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పిన పీసిసి చీఫ్.. టీచర్ ప్రమోషన్లు అమలు చేసి వారికి ఉద్యోగపరంగా ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు.  అంతే కాదు తెలంగాణలో మొత్తం పది లక్షల మందికి నిరుద్యోగ భృతి అందిస్తామని స్పష్టం చేశారు. ఇక కొండగట్టు బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 

tags: uttam, uttam fire on kcr, uttam fire on ktr, uttam fire on trs, uttam fire on trs govt, uttam fire on kcr cm

Related Post