అందుకే భహిష్కరించాం..

news02 July 11, 2018, 8:49 a.m. political

swamy

హైదరాబాద్- స్వామి పరిపూర్ణానందపై పోలీసులు నగర బహిష్కరణ విధించారు. కత్తి మహేష్ వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద స్వామి చేపట్టిన యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆయను రెండు రోజుల పాటు గృహనిర్బందం చేసిన తరువాత చివరకు నగర భహిష్కరణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అండర్ సెక్షన్3 ఆఫ్ తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ ఆన్టీ సోషల్ ఆక్టివిటీస్ ప్రకారం స్వామి పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి భహిష్కరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇక స్వామీజీని భహిష్కరిస్తున్నట్లు ఇచ్చిన నోటీసుల్లో పలు అంశాలను ప్రస్తావించారు పోలీసులు.

1-నవంబర్ 2017లో మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభలో స్వామీజీ ప్రసంగిస్తూ ముస్లింలకు , క్రైస్తవులకు మక్కా, జెరూసలెం వెళ్లేందుకు పెద్దమొత్తం ప్రభుత్వాలు  పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని సబ్సిడీలుగా ఇస్తున్నాయని ప్రశ్నించారని... అలాగే తమ పవిత్ర క్షేత్రాలకు వెళ్లాలంటే మాత్రం సర్ ఛార్జీల పేరుతో పన్నులు వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించారని పోలీసులు తెలిపారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు. 

swamy paripurnananda

2- డిసెంబర్-2, 2017లో రామేశ్వరపల్లి గ్రామం, కామారెడ్డి జిల్లాలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు గుప్పించారు. ఈ సమావేశంలో మీకు నిజాం పాలన కావాలా? లేక ఛత్రపతి శివాజీ పాలన కావాలా అంటూ స్వామీజీ యువతను ప్రశ్నించడంపై  పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొగల్ పాలకులు బాబర్ , గజనీ మహమ్మద్ , ఖిల్జీ, హుమాయున్ వంటి వారు దేశంలో హిందువులపై ఎన్నో అరాచకాలు చేశారని..., అత్యాచారాలు, లూటీలు చేశారని ఎంతోమంది హిందువులను ముస్లిం పాలకులు చంపివేశారని స్వామీజీ తన ప్రసంగంలో పేర్కొన్నారని...ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు

 అలాగే ఈ తెలంగాణ భూమిలోనూ రజాకర్లు ఎన్నో ఘోరాలు చేశారని... ప్రజలపై ముఖ్యంగా  హిందూ మహిళలపై దమనకాండను కొనసాగించారని అన్నారన్నారని... ఇవి కూడా తమకు 
అభ్యంతరకరంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎంతో కాదు స్వామీజీ తెలంగాణలోని ప్రాంతాలు పట్టణాల పేర్లను సైతం మార్చాల్సిన అవసరం ఉందని స్వామీజీ అన్నారని  పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిజామాబాద్ , హైదరాబాద్ , సికింద్రాబాద్, ఆదిలాబాద్ , మహబూబ్ నగర్ , అలాగే నిజామాబాద్ పేరును దాని పూర్వనామం ఇందూరుగా పేరు మార్చాలని అన్నారని పోలీసులు చెప్పుకొచ్చారు.

swamy

3-అటు11 మార్చి 2018లో కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో నూ అభ్యంతరకర  వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. స్వామీజీ చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలంటూ U/S OF 3,  Telangana prevention of anti-social and Hazardous activites act1980 చట్టం ప్రకారం తాము జూబ్లీ హిల్స్ పోలీసులు స్వామీజీకి 09-07-2018 రోజున షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు  పోలీసులు పేర్కొన్నారు. అయితే స్వామీజీకి ఎలాంటి  నోటీసులు ఇవ్వలేదని వారి లీగల్ అడ్వైజర్ తెలిపారు. నోటీసలు ఇచ్చిన 24 గంటల తర్వాత కూడా స్వామీజీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అందుకే వారిని ఆరు నెలలపాటు హైదరాబాద్ నగరంలో  ప్రవేశించకుండా బంజారాహిల్స్ ఏసీపీ నిషేదాజ్ఞలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 


ఇక ఆరు నెలల తర్వాత స్వామీజీ హైదరాబాద్ లో ప్రవేశించాలంటే కూడా ఆంక్షలు విధించారు పోలీసులు. ఇకపై స్వామీజీ హైదరాబాద్ నగరంలో ప్రవేశించాలంటే ముందుగా ఇన్పెక్టర్ ఆఫ్ పోలీసు అనుమతి తీసుకోవాలని..., అలాగే తాను నివసించే చిరునామా తెలుపాలని , అలాగే తాను ఎంతకాలం అక్కడ నివాసం ఉంటున్నారో కూడా తెలుపాలని ఆంక్షలు విధించినట్లు చెప్పారు. పోలీసులు విధించిన ఈ ఆంక్షలపై 15 రోజుల్లో స్వామీజీ ట్రిబ్యూనల్ కు వెళ్లవచ్చనని కూడా 
చెప్పారు. 

మరోవైపు ఈ రోజు తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో స్వామీజీ నివాసంలోకి ప్రవేశించిన పోలీసులు వారిపై నగర పోలీసు కమిషనర్ స్వామీజీపై నగర బహిష్కరణ ఉత్తర్వూలు 
జారీ చేసినట్లు తెలిపారు. 
 

tags: swamy, swamy paripurnananda swamy, paripurnananda swamy, paripurnananda swamy extrenment fro hyderabad

Related Post