చాణక్య సర్వేలో వెల్లడి

news02 Oct. 10, 2018, 4:14 p.m. political

ఉత్తమ్

తెలంగాణలో మహాకూటమికి తిరుగు లేదని తేలిపోయింది. ఈ ఎన్నికల్లో మహాకూటమిదే విజయమని సర్వేలన్నీ మూకుమ్మడిగా చెబుతున్నాయి. మొన్న కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వేలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే హవా అని తేలిన సంగతి తెలిసిందే. ఇదిగో ఇప్పుడు చాణిక్య సర్వేలోను మహాకూటమిదే తెలంగాణలో అధికారమని తేటతెల్లమైంది. టీఆర్ ఎస్ సహా మిగతా పార్టీలన్నీ అత్తెసరు సీట్లతోనే సరిపెట్టుకోవాలని.. కాంగ్రెస్ తో కూడిన మహాకూటిమిదే విజయమని చాణిక్య సర్వేలో వెల్లడైంది.

ఉత్తమ్

అత్యంత శాస్త్రీయంగా నిర్వహించిన చాణిక్య సర్వేలో మహా కూటమికి 69 సీట్లు వస్తాయని తేలింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 49 సీట్ల రాగా, కెలంగాణ జన సమితికి 9 సీట్లు, టీడీపీకి 7సీట్లు, సీపీఐ కి మూడు సీట్లు వస్తాయని స్పష్టమైంది. ఇక వంద సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న టీఆర్ ఎస్ పార్టీకి కేవలం 38 సీట్లు మాత్రమే వస్తాయని చాణిక్య సర్వేలో తేలింది. అటు బీజేపీకి4 సీట్లు, ఎంఐఎం కు 6 సీట్లు, ఇతరులకు 2 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. అత్యంత విశ్వసనీయమైన చాణిక్య సర్వేలో మహాకూటమిదే విజయమని తేలడంతో కాంగ్రెస్ లో ఉత్సాహం.. టీఆర్ ఎస్ లో ఆందోళన కలుగుతోంది.

tags: చాణిక్య సర్వే, chanakya survey, chanakya survey on ts elections, chanakya survey on telangana elections, chanakya survey report on telangana election, congress win in telangana

Related Post