కొడంగల్ లో తీవ్ర ఉద్రిక్తత

news02 Dec. 4, 2018, 8:24 a.m. political

revanth

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అర్దరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లో జరిగే భహిరంగ సభలో పాల్గొంటున్న నేపధ్యంలో రేవంత్ ను అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ భహిరంగ సభ నేపధ్యంలో ఇన్నాళ్లు కొడంగల్ ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. తనపై కోపంతో కొడంగల్ అభివృద్దిని అడ్డుకున్న  కేసీఆర్ వైఖరికి నిరసనగా కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. దీంతో కొడంగల్ లో పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. ఈ క్రమంలో పోలీసులు అర్ధరాత్రి రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఐతే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

revanth

రేవంత్ రెడ్డి కుటుంబంతో ఇంట్లో నిద్రిస్తండగా.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులు రేవంత్ ను అరెస్ట్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇలా దౌర్జన్యంగా రేవంత్ ను అరెస్ట్ చేయడంపై రాజకీయాలకు అతీతంగా అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. కొడంగల్ లో ఓటమి భయంతోనే టీఆర్ ఎస్ పార్టీ అలాంటి చర్యలకు పాల్పడుతోందన్న చర్చ జరుగుతోంది. ఇఖ రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఆయన సతీమణి గీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భర్తను అక్రమంగా.. బలవంతంగా తీసుకెళ్లారని ఆవేధన చెందారు. తన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే చూస్తూ ఉరుకునేందు లేదని ఆమె హెచ్చరించారు. కార్యకర్తలంతా సంయమనం పాటించి.. కొడంగల్ ఓటర్లంతా తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించి.. కనీవినీ ఎరుగని మెజార్టీతో రేవంత్ ను గెలిపించాలని గీత పిలుపునిచ్చారు.

tags: revanth, revanth reddy, revanth arrest, revanth reddy arrest, revanth reddy arres at midnight, police arrested revanth reddy

Related Post