పిలిచారా .. లేక డిఎస్సే వెళ్ళారా ..!

news02 July 11, 2019, 10:10 a.m. political

Kcr vs ds

హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పుడంతా టీఆర్ఎస్ ఎంపీ డీఎస్ గురించే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అధినాయకత్వంపై  తీవ్ర విమర్శలు చేసిన డీఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకావడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  పార్టీ కార్యక్రమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో తనపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. కానీ ఆయనపై పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా .. తాజాగా పార్లమెంటరీ పార్టీ భేటీకి డీఎస్ హాజరుకావడం చర్చనీయాంశమైంది. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డిఎస్ వ్యూహాత్మకంగానే హాజరయి వుంటారనే చర్చ జరుగుతోంది. ఏపార్టీలోనూ జాయిన్ కాకుండా తటస్థంగా ఉన్న డీఎస్ పైన చర్యలు తీసుకునే అవకాశం లేదంటున్నారు.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు డిఎస్‌పై నాలుగు పేజీల ఫిర్యాదుతో లేఖను కేసీఆర్‌కు పంపారు. ఈ లేఖపై డిఎస్ మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఎదురు దాడి చేశారు.

Kcr vs ds

తన కొడుకు సంజయ్‌పై కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని అప్పట్లో డీఎస్ తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో  తన అనుచరులను ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేర్పించినట్టు టీఆర్ఎస్ నేతలే ఆరోపించారు. అనంతరం డిఎస్ కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం కూడా సాగింది.  కానీ అవేం జరగలేదు. ఆ తర్వాత  పార్లమెంట్ ఎన్నికల సమయంలో  డిఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా నిజామాబాద్ నుండి పోటీ చేసి విజయం సాధించారు.  నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవితపై అరవింద్ విజయం సాధించడంతో టీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టీఆర్ఎస్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాయి.  ఏడు స్థానాలను టీఆర్ఎస్ కోల్పోయింది. ఈ ఫలితాలపై కేటీఆర్, కేసీఆర్ కూడా సీరియస్ అయ్యారు.

Kcr vs ds

కాగా .. ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డిఎస్ హాజరుకావడం మాత్రం రాజకీయ వర్గాల్లో  ఆసక్తిని పెంచింది. కేసీఆర్ అనుమతి లేకుండానే డీఎస్ ను ఈ సమావేశానికి పిలిచారా .. అది సాధ్యమేనా .. అయితే టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు మాత్రం దీనిపై పొడిపొడి సమాధానం ఇస్తున్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీకి సంభందించిన మెసేజ్ గ్రూప్ లో అందరికీ వెళ్లినట్లే డీఎస్ కు వెళ్లి ఉండొచ్చు .. ఆయాన వచ్చి ఉండొచ్చు .. అంటున్నారు. డీఎస్ మాత్రం తనను సమావేశానికి పిలిచారు .. కాబట్టే వెళ్ళాను అంటున్నారు. కొరకరాని కొయ్యగా మారిన డీఎస్ ను ఏమి చెయ్యలేక కేసీఆర్ కూడా తలపట్టుకుంటున్నాడు. నిజామాబాద్ ఎఫెక్ట్ వల్లే టీఆర్ఎస్ హైకమాండ్ డీఎస్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి పార్లమెంటరీ పార్టీ భేటీకి హాజరై .. మరోసారి డీఎస్ కేసీఆర్ ను డైలామాలోకి నెట్టాడు.

KCR vs DS

tags: KCR, TELANGANA CM,KTR, HARISH RAO, KAVITHA,D.SRINIVAS,TRS PARLIMENTARY MEETING,LOK SABHA, RAJYASABHA,TRS,CONGRESS,BJP,DHARMAPURI ARAVIND,BJP MP, CONGRESS MPS,DS

Related Post