దేశ కోసం ధ‌ర్మం కోసం

news02 July 10, 2018, 10:35 a.m. political

swami paripurnananda

హైద‌రాబాద్ : స‌్వామి పరిపూర్ణానంద‌.. శ్రీపీఠం అధిప‌తి. ఇంకా చెప్పాలంటే ధ‌ర్మం కోసం -దేశం కోసం అంటు వ‌చ్చిన భార‌త్ టుడే ఛాన‌ల్ అధిప‌తి. బేసిక్‌గా చెప్పాలంటే ఈయ‌న ఓ స‌న్యాసి.. ఏ అంశంపైనైనా అన‌ర్గ‌లంగా మాట్లాడే శ‌క్తి ఈ స్వామీజీ సొంతం. ఇప్పుడు సీన్ క‌ట్ చేస్తే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా వార్తల్లో నిలిచిన వ్య‌క్తి. అయితే ఈ స్వామీజి ల‌క్ష్యం ఏంటీ..? అయ‌న ఈ మ‌ధ్య ఎందుకింతలా దూకుడు పెంచారు..? అవును దీని వెన‌క స్వామీజీ పొలిటిక‌ల్ స్కెఛ్ ఉంద‌ని టాక్.

hyd mp ga paripurnananda

ఏంటీ..? స్వామీజీ ఏంటీ..? పాలిటిక్స్ ఏంటీ.? అనే క‌దా మీ అనుమానం.. అయితే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే..అవును ప‌రిపూర్ణానంద స్వామి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్నారు.. అది కూడా హైదారాబాద్ ఎంపీగా అంటే..? ఇప్ప‌డి వ‌ర‌కు ఓట‌మి ఎరుగ‌ని ఎంఐఎం అధినేత అస‌దుద్దిన్ పై పోటిచేయ‌బోతున్నారు స్వామీజీ.

swami vs asad

అయితే ప‌రిపూర్ణానంద స్వామీ పోటీ వెన‌క బిజేపీ భారీ పొలిటిక‌ల్ స్కెఛ్ ఉన్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతుంది. ఇదంతా తెలంగాణ‌లో అమిత్ షా ఆపరేష‌న్‌లో భాగంగానే ప‌రిపూర్ణానంద పొలిటిక‌ల్ ఎంట్రీ అట‌. ఒక స‌న్యాసి.. అందులో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌కు.. ముఖ్యంగా హిందువుల‌కు బాగా రీచ్ అయిన ప‌రిపూర్ణానందను హైద‌రాబాద్ బరిలో దించితే.. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఓటు బ్యాంక్ పొల‌రైజేష‌న్ అవుతుంద‌న్న‌ది అమిత్ షా ఫ్యూహం. అందులో అస‌దుద్దిన్‌పై కావడంతో.. ఇటు రాష్ట్రంలోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా కూడా హిందూ ఓటు బ్యాంక్‌పై ప్ర‌భావం చూపు తుంద‌ని.. ఇది పార్టీకి లాభీ్స్తుంద‌ని బీజేపీ బాస్ అంచ‌నా. స‌న్యాసీ అయిన‌ ప‌రిపూర్ణానంద స్వామిని అస‌దుద్దీన్‌పై పోటీ పెట్ట‌డం ద్వారా కొంత‌ మైనార్టీ ఓట్ల‌ను కూడా ఆక‌ర్షించ‌వ‌చ్చని భావిస్తున్నారు అమిత్ షా.ఇప్ప‌డికే దీనిపై అమిత్ షా మంత్రాంగం పూర్తి చేశార‌ట‌. 

sha direction lo paripurnananda

ఇలా అండ‌ర్ గ్రౌండ్ ప‌నిలో ఉన్న ప‌రిపూర్ణానంద స్వామికి., క‌త్తి మ‌హేష్ అంశం క‌లిసి వ‌చ్చిన‌ట్లైంది. క‌త్తి శ్రీరాముడిపై వ్యాఖ్య‌లు చేయ‌డం.. అవెంట‌నే స్వామీజీ ధ‌ర్మాగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌డం.. అంతే స్పీడ్‌గా యాదాద్రికి పాద‌యాత్ర‌ను త‌ల‌పెట్ట‌డం చ‌క చ‌కా జ‌రిగి పోయాయ‌ని తెలుస్తుంది. మ‌రోవైపు స్వామీజీకి మ‌ద్ద‌తుగా బీజేపీ, భ‌జ‌రంగద‌ల్‌, విహెచ్‌పి, ఆర్ఎస్ఎస్‌లు రంగంలోకి దిగ‌డం.. ఈ మొత్తం స్కెఛ్ లో భాగంగానే జ‌రిగింద‌ని తెలుస్తుంది. 

paripurna house arrest

అయితే దీన్ని కాస్త ఆల‌శ్యంగా ప‌సిగ‌ట్టిన కేసీఆర్ స‌ర్కార్ స్వామీజిని గృహ నిర్భంధం చేయ‌డం.. అంతే వేగంగా క‌త్తిపై న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు వేసింద‌న్న చ‌ర్చ‌ జ‌రుగుతుంది. అదే స్వామిజీ యాత్ర జ‌రిగి ఉంటే.. ఇది రాష్ట్ర‌ వ్యాప్తంగా ముఖ్యంగా హిందువుల్లో చ‌ర్చ‌నీయాంశ అయ్యేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల వాద‌న‌.

amith shah

మొత్తానికి తెలంగాణ‌లో ప‌రిపూర్ణానంద సెంట‌ర్ పాయింట్‌గా.. అమిత్ షా 'ఆప‌రేష‌న్ హిందూ పోల‌రైజేష‌న్' కు శ్రీకారం చుట్ట‌బోతున్నార‌న్న మాట‌. ఈనెల 13 న హైద‌రాబాద్‌కు వ‌స్తున్న అమిత్ షా.. ప‌రిపూర్ణానంద స్వామితో భేటీ కానున్నారు. అనంత‌రం స్వామీజీ దూకుడు మ‌రింత పెగ‌నుంద‌ని అంటున్నారు క‌మ‌ళ‌నాథులు.

tags: paripurnanda swami,paripurnananda contest as hyderabad mp,paripurnananda swami fire on katti mahesh,paripurnananda tour shedule to yadagiri gutta,paripurnananda fire on asaduddin owaisi,paripurnananda visit to the charminar bhagya laxmi temple,paripurnananda comments on asaduddi owaisi,amith sha appreciat to the paripurnananda swami, case book on paripurnananda swami,paripur nananda house arrest, paripurnananda swami arrested by the hyderabad police,paripurnananda vs asadiddin owaisi, paripurnananda contested as a mp,paripurnananda satirical comments on asaduddi owaisi,sha support to the paripurnananda swamy,bjp,rss,vhp support to the paripurnananda swami,2019 general elections,paripoornananda swami,paripoornananda swami caste,paripoornananda swami wiki,paripoornananda swami speech,paripoornananda swami bhagavad gita part 1,paripoornananda swami parents,paripoornananda swami tv channel,paripoornananda swami bhagavad gita mp3 free download,paripoornananda swami biography,paripoornananda

Related Post