ఎన్నిక‌ల పోటీకి ప‌వ‌న్ ఎంచుకోబోయే నియోజ‌క‌వ‌ర్గం ఏదీ ..!

news02 March 12, 2019, 7:12 p.m. political

pawan kalyan

అమ‌రావ‌తి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పవన్‌ ప్రకటించినా .. ఏ నియోజకవర్గం నుంచి అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఏడాది క్రితం ఆయన ఉత్తరాంధ్రలోని ఏదో ఒక జిల్లా నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత పవన్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినా పోటీపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతూ ఇక్కడి నుంచే పోటీ చేస్తానేమో అంటూ వ్యాఖ్యానించారు. 

pawan kalyan

కానీ ఆ తర్వాత పవన్‌ పోటీకి సంబంధించిన ఎలాంటి విషయమూ బయటకు రాలేదు. తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో పవన్‌ పోటీ చేసే స్థానంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. విశాఖ జిల్లా గాజువాక పేరు కూడా తెరపైకి వచ్చింది. పిఠాపురం లేదా విశాఖ జిల్లా గాజువాక నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్‌ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే ఉత్కంఠకు మరికొద్ది రోజుల్లోనే తెరపడనుంది.

pawan kalyan

tags: PAWAN KALYAN CONTESTING IN ELECTION,JANASENA PARTY ,YSRCP,TDP,CHANDRA BABU,YS JAGAN MOHAN REDDY,ANDRA PRADESH,AP,PAWAN KALYAN,CHIRANJEEVI,CONGRESS,RAHUL GANDHI,RAGHUVERA REDDY

Related Post