ఏకకాలంలో 2లక్షల రైతు రుణమాఫీ..

news02 Oct. 8, 2018, 8:23 a.m. political

uttam

రైతును రాజును చేస్తామని.. రైతు సంక్షేమ రాజ్యం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడలో నిర్వహించిన రైతు రాజ్యం భహిరంగ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్బంగా ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ సర్కార్ ఎప్పుడూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని ఆరోపించిన ఉత్తమ్.. ఈ నాలుగున్నరేళ్లలో సుమారు 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. రోజు రోజుకు వ్యవసాయం పెట్టుబడి పెరిగిపోతుందని చెప్పిన ఉత్తమ్.. ఆ మేరకు అన్నదాత పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పలు మాార్లు అసెంబ్లీలో రైతుల గిట్టుబాటు ధరపై కేసీఆర్ సర్కాార్ ను నిలదీసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

uttam

పంటల భీమా విషయంలోను ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్న ఉత్తమ్.. బ్యాంకులు రుణాలిచ్చే సమయంలో ప్రీమియం కట్టించుకుని.. పంట నష్టపోయినప్పుడు మాత్రం నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. ఇక గత టీఆర్ ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని నాలుగు దఫాలుగా చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పిన ఉత్తమ్.. రైతలుకు మేలు చేసేందుకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అనేక అంశాలను పొందుపరుస్తున్నామని తెలిపారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకేసారి 2లక్షల రూపాయల రుణమాఫఈ చేస్తామని హామీ ఇచ్చారు. రాబోవు కాంగ్రెస్ సర్కార్ రులో రెండు లక్షల రూపాయవ బడ్జెట్ ను రూపొందిస్తామని చెప్పిన ఉత్తమ్..గతంలో రైతు రుణమాఫీ, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ సర్కార్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్న ఉత్తమ్.. తాము అధికారంలోకి రాగానే.. కేంద్రం ఇచ్చే మద్దతు ధరలతో పాటు.. రాష్ట్ర బడ్జెట్ లోను బోనస్ కెటాయించి గిట్టుబాటు అంతేకాకుండా ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

uttam

మొక్కజొన్నకు రెండు వేలు, పత్తికి 6వేలు, మిర్చికి 10వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా మరో 17రకాల పంట ఉత్పత్తులకు మద్తు ధర కల్పిస్తూ.. మొత్తం 5వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భీమా పధకాన్ని ఏర్పాటు చేసి.. వారి ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లింస్తుందని.. 5లక్షల వరకు రైతు ఆరోగ్య భీమా పధకాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక విధ్య విషయంలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. విధ్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ విషయంలో కేసీఆర్ సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డా ఉత్తమ్.. తాము అధికారంలోకి రాగానే విధ్యార్ధులకు వంద శాతం ఫీజు రీయంబర్స్ మెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు.

tags: uttam, uttam kumar reddy, uttam fire on kcr, uttam in raithu rajyam meeting, uttam about agriculture, uttam about formers, uttam in raiturajyam kodada, uttam about former loans

Related Post