యెడ్డికి విష‌మ ప‌రీక్ష‌

news02 May 17, 2018, 12:52 p.m. political

supreme 3

ఢిల్లీ: క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రిగా గురువారం ప్ర‌మాణ స్వీకారం చేసిన యెడ్డీకి ముందున్న‌ది రాచ‌బాట కాద‌ని తెలుస్తోంది. నెంబ‌ర్ గేమ్ స‌రితూగ‌క‌పోతే  యెడ్డీ అదృష్టం త‌ల‌కిందులు అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. గ‌వ‌ర్న‌ర్ త‌న విచ‌క్ష‌ణాధికారాల‌తో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించిన బిజెపిని ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరిన నేప‌థ్యంలో కాంగ్రెస్‌-జేడీఎస్ నేత‌లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ అభ్య‌ర్థ‌న‌పై స్పందించిన సుప్రీంకోర్టు గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్ట‌లేమ‌ని చెప్పింది. అయితే యెడ్డీకి గ‌ల ఎమ్మెల్యేల‌ మ‌ద్ద‌తు జాబితాను వెంట‌నే స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. ఇప్పుడు ఇదే బిజెపికి కంట‌కింపుగా మారిన‌ట్లు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 supreme

బీజేపీకి ప్ర‌స్తుతం 104 ఎమ్మెల్యేల బ‌ల‌ముంది. అయితే శాస‌న స‌భ‌లో ప్ర‌స్తుతం మ్యాజిక్ ఫిగ‌ర్ 112గా ఉన్నందున బీజేపీకి మ‌రో 08 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం ఉంది. బీజేపీ మ‌రో 08 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌త‌ను ఎక్క‌డి నుంచి తీసుకుంటుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించే ఎమ్మెల్యేల జాబితాలో కాంగ్రెస్‌, జేడీఎస్‌కు సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు బ‌య‌ట ప‌డితే ఎలాంటీ ప‌రిస్థితులు ఉత్ప‌న్న‌మ‌వుతాయోన‌ని బీజేపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

supreme

అయితే ఈగండం నుంచి గ‌ట్టెక్కేందుకు యెడ్డీ కొత్త ప‌థ‌కం వేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన 15 రోజుల గ‌డువు వ‌ర‌కు ఆగ‌కుండా.. సుప్రీంకోర్టు కోరిన విధంగా ఎమ్మెల్యేల జాబితాను అందించి వెంట‌నే శాస‌న స‌భ‌ను స‌మావేశ‌ప‌ర‌చాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఫ‌లితంగా అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ చేసుకుని ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే ఎడ్డీ వేసిన ఈఎత్తుగ‌డ ఏమేర‌కు ఫ‌లిస్తుందో వేచి చూడాల‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ్యాజిక్ ఫిగ‌ర్‌కు కావాల్సిన ఆ ఎమ్మెల్యేల‌ను ఏ పార్టీ నుంచి తీసుకుంటారోన‌నేది ఆస‌క్తిగా మారిందంటున్నారు. 

tags: supreme court,bjp,congress,jds,hung,cm yeddi,siddaramaiah

Related Post