మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు టీఆర్ఏఎస్ కుట్ర ..!

news02 Aug. 18, 2019, 9:46 a.m. political

Vijayashanthi

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. అడ్డదారుల్లో అందలం ఎక్కడం .. అడ్డగోలు రాజకీయం చేయడానికి అలవాటు పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం .. మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార దుర్వినియోగానికి పాల్పడటానికి సిద్ధమవుతోందని ఆమె మండిపడ్డారు. వార్డుల విభజన విషయంలో జరిగే అవకతవకలకు సంబంధించి హైకోర్టు తాజాగా చేసిన కామెంట్లను చూశాక కేసీఆర్ సర్కారు ఎంత బరితెగించిందో అర్ధమవుతోందన్నారు. 

Vijayashanthi

వార్డుల విభజనను కంటి తుడుపు చర్యగా హైకోర్టు ప్రస్తావించిందంటే.. ఇక ఎన్నికల నిర్వహణలో ఎన్ని అవకతవకలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రాష్ట్రపతి అడిగితే, అది ప్రతిపక్షాల కుట్ర అంటూ కేసీఆర్ గగ్గోలు పెడుతున్నారని విజయశాంతి అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా కేసీఆర్ విమర్శిస్తున్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. 

Vijayashanthi

తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని చెప్పే కేసీఆర్.. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ప్రతిపక్షాలను ఓడించాలనుకోవడం కుట్ర కాదా అని విజయశాంతి ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి హైకోర్టు జరిపే విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చి, టీఆర్ఎస్ ప్రభుత్వ బండారం బయటపడటం ఖాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో దీని ప్రభావం తప్పక టీఆర్ఎస్ పార్టీపై పడుతుందనడంలో సందేహం లేదని విజయశాంతి అన్నారు.

Vijayashanthi

tags: VIJAYASHANTHI,CONGRESS LEADER VIJAYASHANTHI,FILM STAR VIJAYASHANTHI, GANDHIBHAVAN, RAHUL GANDHI, SONIA GANDHI, PRIYANKA GANDHI,AICC CHIEF SONIA,AICC OFFICE,UTTAM KUMAR REDDY, REVANTH REDDY, BHATTI VIKRAMARKA,KCR, TELANGANA CM, TELANGANA GOVERNMENT, MUNICIPAL ELECTIONS,KTR, TELANGANA BHAVAN,BJP, AMITH SHA, NARENDRA MODI, KISHANREDDY, LAXMAN,TDP

Related Post