సహారా కేసులో కేసీఆర్

news02 Sept. 12, 2018, 9:41 a.m. political

కేసీఆర్

ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సహారా కేసు మళ్లీ తెరపైకి రానుందన్న ప్రచారం జోరుగా సాుగుతోంది. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సహారా గ్రూప్ సంస్తకు నిబంధనలకు విరుద్దంగా మేలు జరిగేలా కేసీఆర్ వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈమేరకు గంతంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు సీబిఐని ఆదేశించింది. సహారా గ్రూప్ కంపెనీల్లో ఉండే ఉద్యోగులందరి పీఎఫ్ ఖాతాలను సొంతంగా నిర్వహించుకునే వెసులు బాటు కల్పించారు అప్పటి కార్మిక శాఖ మంత్రి గా ఉన్న కేసీఆర్. దీంతో సహారా కంపెనీల్లో ఉండే సుమారు 11లక్షల మంది ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను ఆ కంపెనీయే నిర్వహించుకోవడం వల్ల పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తరువాత తేలింది. ఇక ఈ వ్యవహారంలో సహారా కంపెనీకి నిబంధనలకు విరుద్దంగా నిర్ణయం తీసుకున్న కేసీఆర్ కు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయన్న ఆరోపణలున్నాయి.

సీబీఐ

నష్టాల్లో కూరుకుపోయి దివాలా తీసే దశలో ఉన్న సహారా గ్రూప్‌కు పీఎఫ్‌ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తే, ఆ కంపెనీల్లోని ఉద్యోగులకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ అప్పటి చీఫ్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ కమిషనర్‌ ముందే హెచ్చరించినా కేసీఆర్‌ పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలను కేసీఆర్ కు సహారా గ్రూప్ చైర్మెన్ సుబ్రతో రాయ్ ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. అందుకోసమే కేసీఆర్ వ్యవహారంపై విచారణ జరపాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీబీఐ ని ఆదేశించింది. ఐతే ఆ తరువాత కేసు మరుగున పడిపోయింది. ఇక సహారా గ్రూప్ డిపాజిటర్ల నుంచి దాదాపు 24వేల కోట్ల రూపాయను సేకరించి చెతులు ఎత్తేసిన కేసులో కంపెనీ చైర్మెన్ సుబ్రతో రాయ్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిగో మళ్లీ ఇన్నాళ్లకు కేసీఆర్ పై ఉన్న సీబిఐ కేసు అంశం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.

tags: కేసీఆర్, కేసీఆర్ సహారా కేస్, kcr Sahara case, kcr cbi case, kcr in cbi case, kcr in Sahara cbi case, kcr involved in Sahara case

Related Post