శ్రీరామ నవమి శుభాకాంక్షలు-ఉత్తమ్

news02 April 13, 2019, 9:13 p.m. political

uttam

రాబోయే స్థానిక సంస్థలు, ఎంపిటిసి, జడ్పీటీసీల ఎన్నికల కోసం ఈ నెల 15న కాంగ్రెస్ కార్యకర్తల మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయమై ఆయన డీసీసీ అధ్యక్షులకు, నియోజక వర్గ ఇంచార్జీలకు సమాచారమిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలు కష్టించి పని చేస్తున్నారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎన్నికల్లో వారి అభిప్రాయాల్ని గౌరవించి ఎన్నికలలో నిర్ణయాలు తోసుకోవలని నేతలకు సూచించారు. ఈనెల 15న 12 గంటలకు మండల కేంద్రాలలో సమావేశాలు నిర్వహించాలని ఉత్తమ్ ఆదేశించారు. ఈ సమావేశాలను డీసీసీ అధ్యక్షులు సమన్వయం చేయాలని స్పష్టం చేశారు. 

శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఉత్తమ్..
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు శ్రీ రాముడు ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

tags: uttam, uttam on local body election, uttam teli conference, uttam live, pcc chief uttam on local body elections

Related Post