కేసీఆర్ లో కలవరపాటు .. !

news02 July 12, 2018, 3:26 p.m. political

kcr

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ గులాబీ బాస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందా .. అంటే అవుననే అంటున్నాయి అధికార పార్టీలోని విశ్వసనీయ వర్గాలు . కాంగ్రెస్ ప్రకటించిన రుణమాఫీ హామీపై అసలు రైతుల్లో ఎలాంటి స్పందన ఉందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారట సీఎం కేసీఆర్ . ఈ విషయంలో కేసీఆర్ ప్రత్యేకంగా  జరిపిన క్షేత్రస్థాయి సర్వేతో పాటు ఇంటలిజెన్స్ రిపోర్టు  అధికార పార్టీకి మింగుడుపడని విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది .  రైతుబంధు, రైతు బీమా పథకాల కంటే ఒకేసారి రుణమాఫీకి రైతులు ఆసక్తి చూపుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైందట. తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు చెక్కులను 58 లక్షల మంది రైతులు అందుకున్నారు. ఇందులో వంద రూపాయల నుంచి పది వేల వరకు అందుకున్న రైతులు 99 శాతం మంది ఉన్నారు. వీరిలో అధిక శాతం రైతులు రుణమాఫీ హామీకే మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. ప్రస్తుతం రైతు బంధు, బీమా పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే .

kcr

దీని ద్వారా ఎకరాకు పెట్టుబడి సాయం కింద ఎనిమిది వేల రూపాయలు అందిచండంతో పాటు 5 లక్షల మంది రైతులకు బీమా వసతి కలిపిస్తున్నారు. అయితే ఇంత చేస్తున్నా ఆశించిన స్థాయిలో ప్రయోజనం లేదనే సర్వేల ఫలితాలు కేసీఆర్  ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఎన్నికల వేళ అన్నదాతతో బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్న కేసీఆర్ ప్రయత్నాలను కాంగ్రెస్  దెబ్బ తీస్తున్నాయనే కలవరపాటు కేసీఆర్‌లో మొదలైందంట. రైతు  బంధుతో మరోసారి అధికారం గ్యారంటీ అని భావించిన సర్కారుకు వ్యూహాత్మకంగా  రుణమాఫీ అస్త్రానికి పదనుపెట్టి సందించారు పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి .

uttam

రైతు బంధు చెక్కులను అందుకున్న రైతులను కూడా రుణమాఫీకే ఎక్కువ ఆకర్షితులవుతున్నారన్న వార్త గులాబీ బాస్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని టీఆర్‌ఎస్ శ్రేణులు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్  రుణమాఫీ హామీ ఏమాత్రం సాధ్యం కాదంటూ కేసీఆర్ ఎదురుదాడికి దిగినా .. రైతులు దాన్ని లేద్దాగా విశ్వసించడం లేదని .. సర్కార్ కు ఇంటిలిజెన్స్ నివేదికలు ఇచ్చినట్లు సమాచారం . టీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ నాలుగువిడతలు చేసిన విషయంలో  రైతన్నలు గుర్రుగా ఉన్నారని .. మాఫీ విషయం పక్కన పెడితే, వడ్డీ మాఫీ కాకపోవడంతో వడ్డీపై అపరాధ వడ్డీ కూడా బ్యాంకులు విధించాయని రైతులు వాపోతున్నారని ఇంటిలిజెన్స్ నివేదికలు కేసీఆర్ కు అందాయట . 

uttam

tags: KCR Intelgence Reportes On Runamafi,uttam kumar reddy,trs,kcr,ktr,harish rao,kavitha,trs mps,trs mlas,congress,gandhibhavan,trs bhavan,runamafi,raithu bandu,telangana

Related Post