కోడుకు దగ్గర అప్పు చేసిన ముఖ్యమంత్రి

news02 Nov. 15, 2018, 8:23 a.m. political

kcr

టీఆర్ ఎస్ అధినేత.. ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సొంత కారు లేదట. అంతే కాదు కేసీఆర్ సీఎం అయ్యాక ఈ నాలుగేళ్లలో 17 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నారట. ఇంతవరకు బాగానే ఉన్నా.. కేసీఆర్ అప్పులు కూడా చేశానని తన నామినేషన్ సందర్బంగా సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. సాధారనంగా నాయకులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటారు.. అదేనండీ లోన్ లు తీసకుంటారు. ఇంటికోసమో.. కారు కోసమే బ్యాంకుల నుంచి లోన్ లు తీసుకున్నామని నామినేషన్ అఫిడవిట్ లో చెబుతుంటారు. కానీ మన ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కన్న కొడుకు, సొంత కోడలు దగ్గర అప్పు చేశారట. 

kcr

ఇదేంటి కొత్తగా ఉందని అనుకుంటున్నారా.. అవునండీ బాబు.. ఇదీ నిజంగా జరిగిందని సీఎం గారు స్వయంగా తన నామినేషన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. గజ్వేల్ నుంచి టీఆర్ ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన కేసీఆర్.. తన అఫిడవిట్ లో తనకున్న ఆస్తులు.. అప్పుల వివరాలు పొందుపరిచారు. ఇందులో ప్రధానంగా కేసీఆర్ సార్ అప్పుల గురించి చెప్పుకోవాలి. కేసీఆర్ కన్న కొడుకు.. మంత్రి కేటీఆర్ దగ్గర 82 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారట. అంతేకాదు కోడలి దగ్గరా 24 లక్షల 65 వేల రూపాయలు అప్పు చేశారట కేసీఆర్. ఇదేంటీ కన్న కొడుకు.. కోడలి దగ్గర ఎవరైనా అప్పు చేస్తారా.. అవసరం ఉంటే తీసుకుంటారు కానీ.. అప్పు చేయడమెంటని అనుకుంటున్నారా.. మరి కేసీఆర్ సర్ అలా చెబుతున్నారు.. నమ్మడం నమ్మక పోవడం మీ ఇష్టం.

tags: kcr, kcr loans, kcr nominations, kcr assets, cm kcr assets, kcr take loan from ktr, kcr take loan from minister, cm kcr take loan from minister, kcr take loan from minister ktr

Related Post